Ram Gopal Varma
Ram Gopal Varma : రాష్ట్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సిఐడికి( CID) షాక్ ఇచ్చారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ). ఓ కేసులో విచారణకు హాజరుకావాలని సిఐడి నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన హాజరవుతారని అంతా భావిస్తున్న తరుణంలో ట్విస్ట్ ఇచ్చారు. తన స్థానంలో లాయర్ ను పంపించారు. అందుకు కారణాలు చెబుతూ మరో రెండు నెలల గడువు కావాలని కోరడంతో సిఐడి అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో సిఐడి కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది. వైసిపి హయాంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యూహం అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టారు. ఆ కేసులో ఇప్పటికే ఒంగోలు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. 12 గంటలకు పాటు సుదీర్ఘంగా విచారణ జరిపారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారించి వదిలి పెట్టేశారు.
* సిఐడి నోటీసులు
మరోవైపు ఏపీ సిఐడి రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Verma ) నోటీసులు ఇచ్చింది. గతంలో కులాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని నమోదు చేసిన కేసులో విచారణకు పిలిచింది. అందుకు సంబంధించి సమన్లు కూడా పంపించింది. దీంతో ఈరోజు వర్మ సిఐడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన డుమ్మా కొట్టారు. తాను షూటింగ్లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారు. తన లాయర్ ను సిఐడి కార్యాలయానికి పంపించి ఏకంగా 8 వారాల సమయం కావాలని వర్మ కోరినట్లు తెలుస్తోంది. దీంతో రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అరెస్టు సాధ్యం కాదు.
* కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలోకి
ఒంగోలు( Ongole) పోలీసులు విచారణకు హాజరుకావాలని కోరిన సమయంలో సైతం రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చాలా రోజులు పాటు ముప్పు తిప్పలు పెట్టారు. వైసీపీ అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్వేచ్ఛగా మాట్లాడేవారు. ఈ తరుణంలో ఏపీ పోలీసులు ఆయన కోసం చర్యలు చేపట్టారు. కానీ ఆయన దొరకలేదు. ఇంతలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవల ఆయన ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 12 గంటలపాటు రాం గోపాల్ వర్మ విచారణ జరిగింది. అయితే పోలీసులు అడిగిన వాటికి రామ్ గోపాల్ వర్మ సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు సిఐడి విచారణకు హాజరు కాకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అదుపులోకి తీసుకుంటారు అన్న భయంతోనే ఆయన విచారణకు గైర్హాజరైనట్లు సమాచారం.
* అండగా వైసిపి
అయితే రామ్ గోపాల్ వర్మ కు అండగా వైసిపి( YSR Congress ) నిలుస్తోంది. మొన్న విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మను వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఆయన రామ్ గోపాల్ వర్మను కలిసినట్లు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేయాలని సిఐడి భావించినట్టు తెలుస్తోంది. అయితే కోర్టు ఆదేశాలు ఉండడంతో కనీసం అదుపులోకి తీసుకోవాలని చూసినట్లు సమాచారం. ఇది తెలిసి రామ్ గోపాల్ వర్మ విచారణకు గైర్హాజరైనట్లు ప్రచారం నడుస్తోంది.