spot_img
Homeఆంధ్రప్రదేశ్‌గంటా ఫ్యూచర్‌‌ ఏంటి..?

గంటా ఫ్యూచర్‌‌ ఏంటి..?

Ganta Srinivas Rao

గంటా శ్రీనివాసరావు విశాఖలో మొదట్లో ఓ చిరుద్యోగి. ఆయన మీడియా సంస్థలోనూ పనిచేశారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి దిగారు. ప్రత్యూష పేరిట ఒక సంస్థను ప్రారంభించి తొలి అడుగులు వేశారు. ఇదంతా 30 ఏళ్ల క్రితం మాట. ఆ తర్వాత రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. ఆ టైంలోనే మంత్రి అయ్యన్నపాత్రుడితో స్నేహం కుదిరింది. చివరికి రెండు దశాబ్దాల క్రితం టీడీపీ టికెట్ సంపాదించారు. ఎంపీగా అనకాపల్లి నుంచి గెలిచారు. ఆ తరువాత గంటా శ్రీనివాసరావు రాజకీయం చాలా దూకుడుగా ముందుకు సాగింది.

Also Read: చంద్రబాబుకే చమటలు పట్టిస్తున్నాడే?

ముందు నుంచీ టీడీపీని పట్టుకొని ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇప్పుడు బీజేపీ గతి అయ్యేట్లుగా ఉంది. ఆయనకు చంద్రబాబు మీద ద్వేషం లేదు, జగన్ మీద ప్రేమ అంతకంటే లేదు, కేవలం తాను తన అనుచరులు అక్రమంగా చేసిన భూ దందాల నుంచి అర్జంటుగా రక్షణ కావాలి. అందుకే ఆయన అప్పట్లో వైసీపీ వైపు వేగంగా అడుగులు వేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖ భూ దందాల మీద రెండో సారి సిట్ వేశారు. నాడు సిట్ మీద గంటా శ్రీనివాసరావు సైతం సానుకూలంగానే మాట్లాడారు. పైగా తనకు ఏ భయం లేదని కూడా చెప్పుకున్నారు. అయితే దాని వెనక ఆయనకు పొలిటికల్ ప్లాన్ ఉందని తరువాత అర్థం అవుతోంది.

Also Read: బీజేపీ పితలాటకం.. తిరుపతిలో గెలిపిస్తేనే కేంద్రం నిధులా?

అదే సమయంలో విశాఖను పాలనా రాజధానిగా చేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ టీడీపీకి పెట్టింది పేరు. మరో వైపు అమరావతిని మూడో వంతుకు తగ్గించడంతోపాటు, విశాఖకు ప్రియారిటీ ఇవ్వడానికి జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీ ఒక రేంజిలో రెచ్చిపోయింది. విశాఖలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న చోట టీడీపీ గర్జిస్తే అసలుకే ఎసరు అని జగన్ గ్రహించి గంటా శ్రీనివాసరావు వంటి బిగ్ షాట్‌కు స్వాగతం పలికారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో టీడీపీకి విశాఖ జనాల నుంచి ఆశించిన స్పందన కనీపించకపోవడంతో తమ్ముళ్లు తగ్గారు. దానికి తోడు గంటా చేరిక విషయంలో వైసీపీలో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం కావడంతో గంటా కేసుని జగన్ పెండింగ్‌లో పెట్టారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

పది నెలలుగా విశాఖలో అక్రమ నిర్మాణాలతోపాటు, భూ దందాలను కూడా వైసీపీ సర్కార్ తవ్వి తీస్తోంది. మరోవైపు చంద్రబాబు హయాంలో వచ్చిన సిట్ నివేదికతోపాటు, జగన్ వేసిన కొత్త సిట్ ద్వారా కూడా ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. దాంతో పెద్ద తలకాయలు చాలా మంది విశాఖ భూములను చాప చుట్టేశారని కచ్చితమైన ఆధారాలతో సహా వైసీపీ సర్కార్ వద్ద ఉన్నాయి. అందులో పెందుర్తి నియోజకవర్గంలో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన అనుచరుల దందా కూడా బయటపడిందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద పూర్తి విచారణ జరిపి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు అంటున్నారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడానికి తెర వెనక రాజకీయ వ్యక్తిగత కారణాలు జగన్ కి తెలిసిపోవడంతో ఆయన మాజీ మంత్రి డోర్స్ క్లోజ్ చేశారని అంటున్నారు. మొత్తంగా చూస్తే విశాఖ వేదికగా పెద్ద రాజకీయ దుమారమే రేగబోతోందని తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

SKN Producer: యంగ్ హీరోయిన్ కి దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన నిర్మాత SKN ..పాపం పరువు పోయిందిగా..

SKN Producer: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్...

Telugu Heroes: సక్సెసులు లేని హీరోలకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తుందిగా…

Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు సక్సెస్ లను సాధిస్తుండాలి. లేకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ లు...

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Oktelugu Epaper
Exit mobile version