https://oktelugu.com/

టీఆర్ఎస్ వర్సెస్ మజ్లిస్.. కొట్లాట పైకి మాత్రమేనా?

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్-మజ్లిస్ పార్టీలు మిత్రపక్షాలుగా మెలుగుతున్నాయి. ఈ రెండు పార్టీలో ఓ అవగాహన ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అందరికీ తెల్సిందే. కాగా తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు మొదలైనట్టు మజ్లిస్ పార్టీ కూడా గుర్తించినట్లు కన్పిస్తోంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ తో మజ్లిస్  పోటీకి సై అంటోంది. దీనిలో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. Also Read: గ్రేటర్‌‌లో గులాబీ బాస్‌ వెరైటీ వ్యూహం రాష్ట్రంలో మజ్లిస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 5:25 pm
    Follow us on

    trs vs mim

    తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్-మజ్లిస్ పార్టీలు మిత్రపక్షాలుగా మెలుగుతున్నాయి. ఈ రెండు పార్టీలో ఓ అవగాహన ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అందరికీ తెల్సిందే. కాగా తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు మొదలైనట్టు మజ్లిస్ పార్టీ కూడా గుర్తించినట్లు కన్పిస్తోంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ తో మజ్లిస్  పోటీకి సై అంటోంది. దీనిలో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది.

    Also Read: గ్రేటర్‌‌లో గులాబీ బాస్‌ వెరైటీ వ్యూహం

    రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ ఉనికి కేవలం హైదరాబాద్లోని పాతబస్తీకే పరిమితం. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీ క్రమంగా తన ప్రభావం పెంచుకుంటూ పోతుంది. తమ పార్టీకి ఆయువు పట్టువు ఉన్న పాతబస్తీలో మాత్రం ఏ పార్టీని కూడా ఎంటర్ కానివ్వడం లేదు. ఆఖరికీ తమ మిత్రపక్షమైన టీఆర్ఎస్ ను సైతం. ఈక్రమంలోనే వీరిమధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.

    Also Read: అసద్ అభివృద్ధి ఏది?

    జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మజ్లిస్ నేతలు టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లను టార్గెట్ చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది. అయితే ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీకి హిందూ ఓట్లు గప్పగుత్తగా వెళ్లకుండా మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పిస్తుందనే టాక్ విన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    హిందూ ఓట్లను టీఆర్ఎస్-బీజేపీలకు చీల్చడం ద్వారా మజ్లిస్ తన ప్రభావాన్ని చాటుకోవాలని చూస్తోంది. ఈక్రమంలో టీఆర్ఎస్ కూడా మజ్లిస్ కు ప్రత్యర్థి అనే సంకేతాన్ని నగరవాసుల్లోకి పంపుతుంది. దీంతో టీఆర్ఎస్ పై మజ్లిస్ చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ నేతలు తిప్పికొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఎన్నికల వరకేనని ఆ తర్వాత ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసిపోవడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.