ఏ ఎన్నికలోనూ ఓటమి ఎరుగని టీఆర్‌ఎస్ పార్టీకి.. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్యంగా పరాజయం ఎదురైంది. దీంతో గులాబీ బాస్ దీనిని చాలెంజ్‌గా తీసుకున్నారు. దుబ్బాక గెలుపుతో విర్రవీగిపోతున్న బీజేపీకి షాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇందుకు గ్రేటర్ ఎన్నికలను ఆయుధంగా వాడనున్నారు. మిగిలిన పార్టీలతో పోలిస్తే.. గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు.. ఆ ఎన్నికల్లో గతంలో మాదిరి ఫలితాన్ని రిపీట్ చేసేందుకు దాదాపుగా ఏడాదికి పైనే కసరత్తు చేస్తున్నారు. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. తమకున్న అధిక్యతను ప్రదర్శించటం ద్వారా తమ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలన్నదే గులాబీ బాస్ భావిస్తున్నారు.
Also Read: కాంగ్రెస్ కు షాక్.. గ్రేటర్ లో బీజేపీ తరుఫున విజయశాంతి ప్రచారం
అయితే.. గ్రేటర్ ఎన్నికల్లో బాస్ ఎలంటి వ్యూహాలు రచిస్తున్నారో ఒక్కొక్కటిగా బయటకు పొక్కుతున్నాయి. గ్రేటర్‌లోని 150 స్థానాల్లో బరిలోకి దిగిన టీఆర్ఎస్.. ఏ డివిజన్‌కు ఆ డివిజన్‌కు వేర్వేరు వ్యూహాలను సిద్ధం చేసుకోవటం గమనార్హం. గ్రేటర్ మొత్తానికి ఒకటే వ్యూహంగా కాకుండా.. గతంలో తాము గెలుచుకున్న స్థానాలతోపాటు.. మరికొన్నింటి మీదా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందుకోసం తనకున్న వనరులు మొత్తాన్ని వినియోగించుకోవటంతోపాటు.. పార్టీ శ్రేణుల్ని మొత్తంగా కదలించి.. హైదరాబాద్‌లో పాగా వేసేలా చేశారని చెబుతున్నారు.
Also Read: టీఆర్ఎస్ వర్సెస్ మజ్లిస్.. కొట్లాట పైకి మాత్రమేనా?
150 డివిజన్ల బాధ్యతను పలువురు నేతలకు అప్పజెప్పారు. ఒక్కో డివిజన్‌కు కనిష్ఠంగా ఒక ఇన్‌చార్జి.. గరిష్ఠంగా నలుగురు ఇన్‌చార్జీలను పెట్టారు. ఇందుకోసం మంత్రులు.. ఎంపీలతోపాటు.. ఎమ్మెల్సీలను రంగంలోకి దించారు. 62 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు గ్రేటర్‌లోని పలు డివిజన్ల బాధ్యతలను చూస్తున్నారు. చివరకు గ్రేటర్ ఎన్నికల బాధ్యతను తీసుకున్న మంత్రి కేటీఆర్ సైతం.. ఓ డివిజన్ బాధ్యత తీసుకున్నారు. గ్రేటర్ శివారులోని హైదర్‌నగర్ డివిజన్‌కు మంత్రి కేటీఆర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ డివిజన్‌కు కేటీఆర్ తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ కె.రవీందర్‌రావును నియమించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఆయనతోపాటు నిజాంపేట కార్పొరేషన్ మేయర్ నీలా గోపాలరెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. అంతేకాదు.. 76 బూత్‌లకు 15 మంది చొప్పున బాధ్యులను నియమించారు. ఇందుకోసం సిరిసిల్ల నుంచి 800 మందిని రప్పించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. సిరిసిల్ల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 3,500 మందిని రప్పించి హైదరాబాద్‌లోని వివిధ డివిజన్లలో ప్రచారానికి దించటం గమనార్హం. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ అనుసరించని వ్యూహాన్ని సీఎం కేసీఆర్ ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు. మరి కేసీఆరా.. మజాకా..?