spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vijayawada Road Incident: యూత్ జర చదవండి.. ఇగో వైఫైలా ఉంటే.. ఇదిగో ఇలా ఊచలు...

Vijayawada Road Incident: యూత్ జర చదవండి.. ఇగో వైఫైలా ఉంటే.. ఇదిగో ఇలా ఊచలు లెక్కబెట్టాల్సి వస్తది..

Vijayawada Road Incident: ఇటీవల విజయవాడ నగరంలో ఒక యువతీ విషయంపై ఇద్దరూ యువకులు మనస్పర్ధలు గురయ్యారు. ఫలితంగా వారిద్దరి మధ్య వ్యక్తిగత ద్వేషాలు పెరిగిపోయాయి. ఒకరి మీద మరొకరు పగ పెంచుకున్నారు. చివరికి అంతం చేసుకునే స్థాయి దాకా వెళ్లారు. గడచిన గురువారం రాత్రి హై టెన్షన్ రోడ్డులో అత్యంత దారుణంగా తమ వాహనాలతో ఢీకొట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో ఓం, రోహిత్ సాయి అనే వ్యక్తులు కలిసిపోయారు. ఇది కాస్త ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. తమదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు. తత్వం బోధపడిన ఆ ఇద్దరు.. అనంతరం పోలీస్ స్టేషన్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.

వ్యక్తిగత అహానికి వెళ్ళిపోయాం.. ఇరుక్కుపోయాం.. అనవసరంగా పరువు తీసుకున్నామని బాధపడ్డారు. చిన్నపాటి వ్యవహారాలను సరిదిద్దుకొని ఉంటే ఇక్కడదాకా వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. అమ్మాయి విషయంలో గొడవల వల్ల వీరిద్దరూ కొద్దిరోజులుగా మాట్లాడుకోవడం లేదు.. ఓం విశాఖపట్నంలో బీబీఏ పూర్తి చేశాడు. ఇతడి తండ్రికి జేజే ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ వ్యవహారాలను హోమ్ చూసుకుంటున్నారు. ఇక లింగమనేని రోహిత్ సాయి అనే యువకుడు తాడేపల్లి ప్రాంతంలో బి బి ఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇతడి తండ్రికి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఉంది. ఈ ఘటన జరిగినప్పుడు రోహిత్ సాయి, ఓం తోపాటు వారి స్నేహితుడు కూడా ఉన్నారు. ఓం వెహికల్ లో మోహిత్, సిద్ధార్థ అనే యువకులను ఎక్కించుకున్నాడు. నేరుగా హెచ్డి లైన్ రోడ్లోకి వచ్చాడు. రోహిత్ గూడా తనకు అత్యంత దగ్గర స్నేహితుడైన మహమ్మద్ ఆఫాన్ ను అనయకుడిని ఎక్కించుకున్నాడు. వీరిద్దరూ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో స్నేహితుల ప్రమేయం లేదని పోలీసుల విచారణలో తేలింది.

ఘటన జరిగిన అనంతరం వారిద్దరి రక్తనమునాలను పోలీసులు పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అందులో ఏమైనా మత్తు పదార్థాలు తీసుకున్నారా.. అనే అంశంపై పోలీసులు కూపిలాగారు. ఇందులో ఓం మత్తు పదార్ధాలు తీసుకున్నట్టు తేలింది. రోహిత్ సాయి విషయంలో మాత్రం ఎటువంటి పాజిటివ్ ఫలితం రాలేదు.. అనంతరం భూమి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. అందులో శక్తికి ఉపయోగించే మాత్రలు.. ఇతర చూర్ణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వాహనాలు కూడా హాకీ కర్రలు.. ఇనుప రాడ్లు కనిపించాయి.. అయితే రోహిత్ సాయి సహనం కోల్పోయి కొండలరావు అనే వ్యక్తిని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. అతడి ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు సాక్ష్యంగా తీసుకున్నారు. అయితే వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంపై ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper