https://oktelugu.com/

Vallabhaneni Vamsi Mohan : మాకెందుకీ శిక్ష.. జైలుగోడల మధ్య వైసీపీ నేతల ఆక్రందన*

Vallabhaneni Vamsi Mohan : కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలకు తత్వం బోధపడుతోంది. జగన్మోహన్ రెడ్డి కోసం చాలామంది పరితపించారు.

Written By: , Updated On : March 26, 2025 / 10:36 AM IST
Vallabhaneni Vamsi Mohan

Vallabhaneni Vamsi Mohan

Follow us on

Vallabhaneni Vamsi Mohan : కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలకు తత్వం బోధపడుతోంది. జగన్మోహన్ రెడ్డి కోసం చాలామంది పరితపించారు. ఆయనపై ఈగ వాలనిచ్చేవారు కాదు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు పోసాని కృష్ణ మురళి. వల్లభనేని వంశీది కూడా అదే తీరు. బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి అయితే చెప్పనవసరం లేదు. మీరే కాదు జగన్మోహన్ రెడ్డిని అమితంగా అభిమానించే చాలామంది ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో ముందుండేవారు. ఈ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించేవారు. అటువంటి వారంతా ఇప్పుడు కష్టాలు పడుతున్నారు. జైలు జీవితం అనుభవిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి అంతగా అండగా నిలిచిన వీరికి.. అదే స్థాయిలో జగన్ నుంచి అండదండలు లభించడం లేదు.

Also Read : పోలవరం గట్లను తోడేసిన వల్లభనేని వంశీ.. రూ.100 కోట్ల స్కామ్.. కూటమి సీరియస్ యాక్షన్!

* తీవ్ర నిరాశ
నెల రోజులకు పైగా వల్లభనేని వంశీ మోహన్( vallabhaneni Vamsi Mohan ) జైల్లో ఉన్నారు. ఆయన రిమాండ్ కొనసాగుతూనే ఉంది. నిన్ననే ఆయన రిమాండ్ ముగిసింది. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. అటు తరువాత ఏప్రిల్ 8 వరకు ఆయనకు రిమాండ్ తప్పదని తేలిపోయింది. దీంతో వల్లభనేని వంశీ మోహన్ నీరు గారి పోయారు. కుటుంబ సభ్యులు సైతం తీవ్ర కలత చెందారు. వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని తెలియడంతో తీవ్ర ఆందోళనతో ఉన్నారు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై వంశీ మోహన్ తీవ్రంగా విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది.

* వల్లభనేని రుస రుస
వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) ఆయన విషయంలో స్పందించలేదు. రెండు రోజుల తర్వాత మాత్రమే పరామర్శకు వచ్చారు. ఆయన వెంట కొంతమంది నాయకులు వచ్చి పరామర్శించారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు పట్టించుకునే వైయస్సార్ కాంగ్రెస్ నేత లేకుండా పోయారు. కనీసం పలకరించిన పాపాన కూడా పోలేదు. దీంతో తీవ్రంగా రగిలిపోతున్నారు వంశీ మోహన్. పైగా న్యాయ సహాయం అందించడంలో కూడా పార్టీ అధినేత ఫెయిల్ అయ్యారని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి కోసం బలయ్యానని వంశీ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

* బోరుగడ్డది అదే పరిస్థితి
అటు బోరుగడ్డ అనిల్ కుమార్( boorugada Anil Kumar ) పరిస్థితి అలానే ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం బోరుగడ్డ ఎంతలా మాట్లాడారు సోషల్ మీడియాలో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. గత నాలుగు నెలలుగా ఆయన జైలు జీవితం అనుభవిస్తూనే ఉన్నారు. తాజాగా కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్నారు. కోర్టు కూడా ఆయన విషయంలో సీరియస్ గా ఉంది. ఇప్పట్లో అనిల్ కుమార్ బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆయన సైతం జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నట్లు సమాచారం. తనకు కనీస న్యాయ సహాయం చేయడం లేదని ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జైలు పక్షులంతా జగన్మోహన్ రెడ్డి పై గగ్గోలు పెడుతున్నారు అనమాట

Also Read : తెల్లటి జుట్టు, గెడ్డం.. వల్లభనేని వంశీ అలా మారిపోయారేంటి?