Homeఆంధ్రప్రదేశ్‌Madanapalle Files Burning Case: పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు.. ఆ ఇద్దరి అరెస్ట్!

Madanapalle Files Burning Case: పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు.. ఆ ఇద్దరి అరెస్ట్!

Madanapalle Files Burning Case: ఏపీలో ( Andhra Pradesh) మరో కొత్త కేసు తెరపైకి వచ్చింది. మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో బుధవారం కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముని తుకారాం, మాధవ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముని తుకారాం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ గా వ్యవహరించారు. మాధవరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధానానుచరుడు. వీరిద్దరూ మదనపల్లె ఫైల్స్ కేసులో a3, ఏ4 నిందితులుగా ఉన్నారు. వీరిద్దరూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే వీరి అరెస్టు జరిగింది.

అగ్ని ప్రమాదం కలకలం..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సంబంధమైన కేసులను తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో 2024 జూలై 21న మదనపల్లి( Madanapalli ) ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. రెవెన్యూ ఫైల్స్ కాలిపోయాయి. అందుకే ఇది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన అని అనుమానిస్తూ పలు అభియోగాలు నమోదయ్యాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఘటనకు కారణమన్న అనుమానాలు బలపడ్డాయి.. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన సమయంలో మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, హరిప్రసాద్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆర్డీవోగా గతంలో పనిచేసిన మురళి అనే అధికారిపై కూడా చర్యలు తీసుకున్నారు.

ఆ అనుమానాలతోనే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో అవకతవకలు బయటపడకుండా ఉండేందుకుగాను ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం 2024 ఆగస్టులో మదనపల్లి ఫైల్స్ కేసును సీబీసీఐడీకి అప్పగించింది. అందులో భాగంగా సిఐడి అధికారులు గౌతమ్ తేజ్ తో పాటు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి, మురళిలను అరెస్టు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో మాధవరెడ్డికి కోర్టు రిమాండ్ విధించలేదు. దీంతో ఆయన బయటే ఉన్నారు. మరోవైపు ఏ 4 నిందితుడిగా ఉన్న ముని తుకారాం గత ఏడాది జూలైలో అమెరికా వెళ్ళిపోయారు. బుధవారం వీరిద్దరినీ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర పై దర్యాప్తు ముమ్మరంగా సాగే ఛాన్స్ కనిపిస్తోంది. పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు అర్థమవుతుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version