Vallabhaneni Vamsi Mohan : వల్లభనేని వంశీ మోహన్ ఇటీవల కనిపించడం మానేశారు. ఆయనపై త్వరలో కేసులు నమోదవుతున్న దృష్ట్యా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం నడిచింది.వాస్తవానికి వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది.ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కలిసి బయటకు వెళ్లిపోయిన వంశీ..తన సొంత నియోజకవర్గంలో గన్నవరంలో అడుగుపెట్టలేకపోయారు. అప్పుడప్పుడు కోర్టు కేసులకు మారువేషంలో వస్తున్నారు. అయితే తొలుత ఆయన అమెరికా పారిపోయారని ప్రచారం నడిచింది. కానీ మధ్య మధ్యలో కనిపించారు.వైసిపి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కొడాలి నాని పక్కనే దీనంగా కూర్చున్నారు. పూర్తిగా రాజకీయాలను విడిచిపెట్టి అమెరికా వెళ్లిపోతారని కూడా తెగ ప్రచారం నడిచింది. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూటమి ప్రభుత్వం విడిచి పెట్టే ఛాన్స్ లేదు.అందుకే తన అనుచరుల వద్ద తాను రాజకీయాలకు దూరము అవుతానని అర్థం వచ్చేలా మాట్లాడారు. కొందరు కుల పెద్దలు రంగంలోకి దిగి కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గన్నవరంలో వంశి అనుచరులు పెద్ద ఎత్తున అరెస్టు అవుతున్నారు. తరువాత అరెస్టు వల్లభనేని వంశీ దేనని ప్రచారం నడుస్తోంది. అయితే అది మామూలు కేసు కాదట. దాదాపు 100 కోట్లు విలువ చేసి ఆర్థిక నేరానికి వంశీ పాల్పడినట్లు తెలుస్తోంది. దాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం.
* కాలువ గట్లు తవ్వేశారు
వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచారు. అయితే ఆయనపై ఉన్న బినామీ ఇళ్ళ పట్టాల కేసు ఒకటి బయటకు తెచ్చింది వైసిపి. పార్టీలోకి వస్తేనే ఎటువంటి కేసు లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది.పార్టీలోకి వెళ్లిన తర్వాత ఆ కేసును అడ్డం పెట్టుకొని చంద్రబాబు కుటుంబం పై విరుచుకుపడేలా చేసింది జగన్ సర్కార్.అయితే ఇంతవరకు జరిగింది ఇదేనని అంతా భావించారు. అయితే వంశీ హయాంలో పోలవరం కాలువ గట్లను కూడా తవ్వుకొని అమ్మేసుకున్నట్లు తాజాగా తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ప్రభుత్వం ప్రాథమిక విచారణలో తేలింది. ఇక కేసు పెట్టి అరెస్టు చేయడమే మిగిలింది.
* అంతా బినామీలతోనే
అయితే మొత్తం బినామీలతోనే ఈ తతంగం జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే డ్రైవర్లు, వైసీపీ నేతల దగ్గర పనిచేసిన వారిని బినామీలుగా పెట్టి లైసెన్సులు తీసుకున్నారు. తీసుకున్న లైసెన్సులు ఒకచోట అయితే మరోచోట తవ్వకాలు జరిపారు. ఇలాంటి లెక్కలను విజిలెన్స్ బయటకు తీసింది. దాదాపు 100 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించింది.అయితే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన విజిలెన్స్ బినామీ దారులను అరెస్టు చేయడం ప్రారంభించింది. అయితే తాము అటువంటి లైసెన్సులు తీసుకోలేదని..ఆధార్ కార్డు జిరాక్స్లు వల్లభనేని వంశీ అడిగితే ఇచ్చామని వారు చెబుతున్నారు.తమ ఆధార్ కార్డులు పెట్టి వంశీ లైసెన్స్ తెచ్చుకుని చదువుకున్నారని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వల్లభనేని వంశీ పై రేపో మాపో పట్టిష్టమైన ఒక కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.అదే జరిగితే ఆయనపై క్రిమినల్ కేసుతో పాటు ఆర్థికపరమైన కేసులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.