AP liquor scam : ఏపీ లిక్కర్ స్కాంలో( AP liquors cam ) కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోందా? జాతీయస్థాయిలో ఈ స్కాం ను బయట పెడుతోందా? జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించాలని చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. లోక్సభలో టిడిపి పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఈమధ్య స్కాం ద్వారా వచ్చిన ధనాన్ని హవాలా రూపంలో విదేశాలకు చేర్చారని ఆరోపించారు. మిగతా రాష్ట్రాల్లో జరిగిన లిక్కర్ స్కాం కంటే.. ఏపీలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు లావు శ్రీకృష్ణదేవరాయలు. సిబిఐతోపాటు ఈ డి ఎంట్రీ అవ్వాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు.
Also Read : ఐదేళ్లలో భారీ మద్యం కుంభకోణం.. ఆ నలుగురే కీలకం
* గత ఐదేళ్లలో అవకతవకలు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో కొత్తగా మద్యం పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది జగన్ సర్కార్. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపింది. అయితే గత ఐదేళ్లగా నాసిరకం మద్యం సరఫరా జరిగింది. మిగతా ప్రాంతాల్లో కనిపించే ప్రీమియం మద్యం బ్రాండ్లు.. ఏపీలో కనిపించలేదు. అప్పటివరకు ఉన్న డిష్టలరీలను బెదిరించి వైయస్సార్ కాంగ్రెస్ నేతలు తమ స్వాధీనం చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం తయారీదారులు వారే.. సరఫరాదారులు కూడా వారే.. చివరకు మద్యం విక్రయించింది వారి మనుషులే. అందుకే ఆరేళ్లలో 32 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు లో అవకతవకలు జరిగాయి అన్నది కూటమి ప్రభుత్వ ఆరోపణ. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కేసులు నమోదయ్యాయి. అరెస్టుల పర్వం కూడా కొనసాగింది.
* అప్పటి బేవరేజస్ చైర్మన్ పై
ప్రధానంగా ఈ లిక్కర్ స్కాంలో అప్పటి బేవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి పై( Vasudeva Reddy) ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అరెస్టు జరిగింది. అప్పటి మద్యం విక్రయాల్లో జరిగిన అవకతవకల విషయంలో ఆధారాలను సేకరించింది ఏపీ సి ఐ డి. పూర్తిస్థాయి ఆధారాలు లభించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అయితే డిస్టలరీలను బెదిరించి స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు ఎంపీ మిధున్ రెడ్డి పై వచ్చాయి. దీంతో ఆయన అరెస్టు తప్పదని ప్రచారం సాగింది. ఈ తరుణంలో ఆయన అరెస్టు కాకుండా ముందస్తుగా బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే అప్పటి బేవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది.
* వివిధ రాష్ట్రాల్లో లిక్కర్ స్కాం
ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో జరిగిన లిక్కర్ స్కామ్ లలో ఆ రాష్ట్ర పాలిత ముఖ్యమంత్రులతో పాటు కీలక మంత్రులు అరెస్టయ్యారు. కొద్దిరోజుల పాటు జైల్లో గడిపారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) విషయంలో కూటమి అదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అందుకే లోక్సభ వేదికగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ సంచలన ఆరోపణలు చేశారు. సిబిఐతో పాటు ఈడి ఎంట్రీ కావాలని కోరారు. మున్ముందు ఈ లిక్కర్ స్కాం విషయంలో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read : ఏపీలోనూ ఢిల్లీ లిక్కర్ స్కాం జాడలు