Minister Rajini
Minister Rajini : మాజీ మంత్రి విడదల రజిని( Rajini ) మరిన్ని కష్టాలను తెచ్చుకున్నారు. ఆమె హయాంలో జరిగిన అవకతవకలపై బాధితులే నేరుగా మీడియా ముందుకు వస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు త్వరలో చూపడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు తనపై రాజకీయ కక్ష సాధింపునకు దిగుతున్నారని మాజీ మంత్రి విడదల రజిని చెప్పుకొచ్చారు. కానీ ఓ ఒప్పందం విషయంలో రైతులకు తిరిగి ఇప్పుడు సొమ్ము చెల్లించడంతో తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లు అయింది. ఈ క్రమంలోనే తన వద్ద వసూలు చేసిన సొమ్ము కూడా తిరిగి ఇవ్వాలని స్టోన్ క్రషర్ యజమాని కోరడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి రజిని, ఆమె మరిది, పీఏ చర్యలు బయటపడ్డాయి.
Also Read : మంత్రి రజినీయే కాదు.. ఆమె ఓఎస్డీ కూడా అదే టైపా? ఏంటీ దారుణం?
* మంత్రిగా అవకాశం
2019లో అనూహ్యంగా చిలకలూరిపేట( chilakaluripeta ) తెర పైకి వచ్చారు రజిని. అప్పటివరకు ఆమె తెలుగుదేశం పార్టీలో కొనసాగే వారు. ప్రత్తిపాటి పుల్లారావు అనుచరురాలుగా కొనసాగారు. అయితే ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా మారిపోయారు. జగన్ ప్రభంజనంలో గెలిచారు. అది మొదలు ఆమె హవా ప్రారంభం అయ్యింది. విస్తరణలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి.
* కలెక్షన్ల పర్వం
అయితే చిలకలూరిపేట కాదు.. పల్నాడు జిల్లాలో( Palnadu district) ఏ చిన్న చాన్స్ వచ్చినా ఆమె వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా ఆమె సమీప బంధువు, స్వయానా మరిది, ఆపై పిఏ కలెక్షన్ల పర్వానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. బదిలీలు, ప్రమోషన్ల సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు నియామకాలు చేపట్టారు అన్న ఆరోపణ కూడా ఉంది. అయితే అప్పట్లో ఐపీఎస్ అధికారి జాషువాను అడ్డం పెట్టుకుని స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. అయితే ఇది ఓ రైతుల విషయంలో చెల్లింపుల తర్వాతే బయటపడింది.
* అన్ని వేళ్ళు అటువైపే
చిలకలూరిపేట నియోజకవర్గంలో కొందరు రైతులకు ప్రభుత్వం సొసైటీ పరంగా భూములు కేటాయించింది గతంలో. దశాబ్దాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు సంబంధిత రైతులు. అయితే ఆ భూమిలో విలువైన ఖనిజం ఉందని తెలియడంతో ముఖ్యమంత్రి జగన్( Jagan Mohan Reddy) బంధువులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎకరాకు 8 లక్షలు సర్దుబాటు చేసి ఆ భూమిని అంత స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో మంత్రి రజిని కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ బాధితులంతా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మరోవైపు చాలామంది రైతుల వద్ద జగనన్న కాలనీ లేఅవుట్ ల కోసం భూములు సేకరించారు. ప్రభుత్వం వద్ద ఎక్కువ రేటు తీసుకుని రైతులకు మాత్రం తక్కువ ధర చెల్లించారు. అటువంటి వారంతా ఇప్పుడు బయటపడుతున్నారు. నేరుగా ఫిర్యాదు చేస్తుండడంతో రజిని పేరు బయటకు వచ్చింది. దీంతో కొంతమంది రైతులకు సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అందరి వేళ్ళు మాజీ మంత్రి రజిని వైపే చూపుతున్నాయి. మున్ముందు ఆమె అరెస్టు తప్పదని టాక్ నడుస్తోంది.
Also Read : ఏపీ మంత్రి విడుదల రజినీ గురించి ఎవరికీ తెలియని విషయాలివీ!