ABN Reporter Viral video:తనను ఇబ్బంది పెడుతున్నారని.. డబ్బుల కోసం వేధిస్తున్నారని ఆంధ్రజ్యోతిలో పనిచేసే ఉద్యోగి ఆరోపించాడు. స్వీయ వీడియో ద్వారా తన ఆవేదనను మొత్తం వెల్లడించాడు.. నిజామాబాద్ బ్యూరో ఇన్చార్జి సంపత్, కామారెడ్డి స్టాఫ్ రిపోర్టర్ ప్రశాంత్ తనను వేధిస్తున్నారని.. టార్చర్ పెడుతున్నారని.. నరకం చూపిస్తున్నారని ఆ ఉద్యోగి ఆ స్వీయ వీడియోలో వెల్లడించాడు. ఆ వీడియోను గులాబీ పార్టీ అనుకూల సామాజిక మాధ్యమ హ్యాండిల్స్ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
” అందరికీ నమస్కారం సార్. నేను గత 15 సంవత్సరాలుగా ఆంధ్ర జ్యోతిలో పనిచేస్తున్నాను సార్. నిజామాబాద్ బ్యూరో ఇన్చార్జి సంపత్, కామారెడ్డి స్టాఫ్ రిపోర్టర్ ప్రశాంత్ నన్ను డబ్బుల కోసం వేధిస్తున్నారు సార్. నేను డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేను సార్. నన్ను కొంతకాలంగా వారిద్దరూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు సార్.. నాకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. నేను ఉంటున్నది పెంకుటింట్లో సార్. ఎవరైనా వచ్చి విచారణ చేసుకోవచ్చు సార్.. నేను రేపు చనిపోబోతున్నాను సార్.. నా ఆవేదన తెలియాలని ఇలా మీ ముందుకు వచ్చాను సార్. ఆంధ్రజ్యోతి ద్వారానే ఇన్ని రోజులు బతికాను సార్. ఇప్పుడు నన్ను పెడుతున్న ఇబ్బందులు మామూలుగా లేవు సార్.. ఈ సమయంలో నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను సార్.. అన్ని వివరాలు మీరే తెలుసుకోగలరు సార్. రేపు నేను చనిపోయిన తర్వాత మీకు తప్పకుండా అన్నీ తెలుస్తాయి సార్” అంటూ ఆ వ్యక్తి ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు..
సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసిన ఆ వ్యక్తి గతంలో ఆంధ్రజ్యోతిలో పనిచేసినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ బ్యూరో ఇన్చార్జి సంపత్, కామారెడ్డి స్టాఫ్ రిపోర్టర్ ప్రశాంత్ అతడిని ఇబ్బంది పెడుతున్నారని, డబ్బుల కోసం వేధిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందువల్లే అతడిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అతడు ఒక కంట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే ఇటీవల అతడు వేరే విషయాలలో ఇన్వాల్వ్ అయినట్టు.. అందువల్లే అతడిని యాజమాన్యం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. తనను పక్కన పెట్టిన అక్కసుతోనే సదరు వ్యక్తి బ్యూరో ఇన్చార్జ్, స్టాఫ్ రిపోర్టర్ మీద విమర్శలు చేసినట్టు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
సదరు ఉద్యోగి సెల్ఫీ వీడియో ద్వారా బయటికి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతిలో జరుగుతున్న వ్యవహారాలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆంధ్రజ్యోతిలో క్షేత్రస్థాయిలో పనిచేసే రిపోర్టర్ల పై ఒత్తిళ్లు పెరిగిపోయాయని.. సర్కులేషన్, యాడ్స్ చేయాలంటూ టార్గెట్లు విధిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సర్కులేషన్ పెంచడానికి రిపోర్టర్లకు టార్గెట్లు విధించారని.. జిల్లా కార్యాలయాలలో సమావేశాలు పెట్టి మరీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే యాడ్ టార్గెట్లు.. సర్కులేషన్ టార్గెట్లు పూర్తి చేయలేని రిపోర్టర్లను వేధిస్తున్నారని సమాచారం. అంత కాదు కొంతమందిని అడ్డగోలుగా తొలగిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. తాజాగా కామారెడ్డి పరిధిలో పనిచేసే ఉద్యోగి ఇలా స్వీయ వీడియో ద్వారా తన ఆవేదనను వెల్లడించడంతో.. ఆంధ్రజ్యోతిలో జరుగుతున్న పరిస్థితి మరోసారి ప్రపంచానికి తెలిసింది. మరి దీనిపై మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
నేను చనిపోతున్నాను.. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సెల్ఫీ వీడియో
నేను రేపు చనిపోతున్నాను దానికి కారణం కామారెడ్డి జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫర్ ప్రశాంత్, నిజామాబాద్ బ్యూరో ఇంచార్జి సంపత్ కారణం
17 సంవత్సరాలు ఆంధ్రజ్యోతిలో పనిచేశాను
కామారెడ్డి జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫర్ ప్రశాంత్, నిజామాబాద్… pic.twitter.com/vPsQ4gSV6N
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2025