Tirupati-Katpadi Railway line : కేంద్రంలోని ఎన్డీఏ( National democratic Alliance ) ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో దక్షిణాది రాష్ట్రాలకు పెద్దపీట వేస్తోంది. తాజాగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తిరుపతి- కాట్పాడి లైన్ డబ్లింగ్ కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తికి వచ్చే ప్రయాణికులతో పాటు విద్యా వైద్య సంస్థలు ఎక్కువగా ఉండే ప్రాంతానికి లబ్ధి చేకూరనుంది. కేంద్ర మంత్రివర్గ భేటీలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రూ. 1332 కోట్లతో డబ్లింగ్ పనులకు ఆమోదం లభించింది.
Also Read : వర్మ మాటలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించించేనా!?
* వివరాలు వెల్లడించిన రైల్వే మంత్రి..
అయితే ఈ కీలకమైన నిర్ణయానికి సంబంధించిన అంశాలను వెల్లడించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్( Railway Minister Ashwini Vaishnav ). ఈ ప్రాజెక్టు ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట క్షేత్రాలకు లక్షల్లో భక్తులు తరలి వస్తారని చెప్పారు. తిరుపతి,వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్ లుగా ఉన్నాయి. దీంతో రాయలసీమ ప్రాంతానికి సైతం ప్రయోజనం చేకూరుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్, సిమెంట్, స్టీల్ తయారీ కంపెనీలు కూడా లబ్ధి పొందుతాయని వివరించారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
* చాలా రకాలుగా లబ్ధి..
ఈ ప్రాజెక్టులో భాగంగా 17 మేజర్, 327 మైనర్ వంతెనలు నిర్మించనున్నారు. అదేవిధంగా 7 పై వంతెనలు, 30 అండర్ పాస్ బ్రిడ్జిలు రానున్నాయి. 14 కిలోమీటర్ల మార్గం రోడ్డుకు బదులు రైలు మార్గానికి రద్దీ మల్లుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. 20 కోట్ల కిలోల కార్బన్డయాక్సైడ్( Karbonn dioxide ) తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నాలుగు కోట్ల లీటర్ల డీజిల్ పొదుపు అవుతుందని కూడా తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర పడడంతో డబ్లింగ్ కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : అమరావతి టు హైదరాబాద్.. కేవలం నాలుగు గంటల్లోనే!