Pithapuram Varma: పిఠాపురం ( Pithapuram) రాజకీయం పతాక స్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా నాగబాబు వ్యవహార శైలి పిఠాపురం కూటమిలో చిచ్చు రేపింది. తాజాగా ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి నేరుగా పిఠాపురం వచ్చారు. వర్మ కు కౌంటర్ ఇస్తున్నట్లు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కనీసం వర్మకు ఆహ్వానించలేదు. ఈ చర్యలను తప్పు పట్టింది టిడిపి క్యాడర్. నేరుగా ఎమ్మెల్సీ నాగబాబుకే కౌంటర్ ఇచ్చినంత పని చేసింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురం టిడిపి ఇన్చార్జ్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక రేపుతున్నాయి. తన ప్రమేయం లేకుండా పిఠాపురంలో పవన్ గెలిచినట్టే.. పవన్ ప్రమేయం లేకుండా ఏపీలో కూటమి అధికారంలోకి రాగలిగిందని చెప్పారు వర్మ. తద్వారా పవన్ కళ్యాణ్ కు గట్టిగానే కౌంటర్ ఇవ్వగలిగారు.
Also Read : బట్టలూడదీస్తావా? జగన్ కి మహిళ పోలీస్ స్ట్రాంగ్ కౌంటర్.
* నాగబాబు కామెంట్స్
జనసేన( janasena ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురంలో నిర్వహించారు. భారీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహం ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సైతం చాలా దూకుడుగా మాట్లాడారు. నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ నిలబెట్టినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం లో పవన్ గెలుపు వెనుక ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది వారి కర్మ అంటూ తేల్చేశారు. తద్వారా పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ పాత్ర లేదని సంకేతాలు ఇచ్చారు. అప్పటినుంచి కూటమిలో ఒక రకమైన విభిన్న వాతావరణం కనిపిస్తుంది. అప్పటివరకు పవన్ చర్యలను అభినందించిన టిడిపి శ్రేణులు కాస్త ఆలోచించాయి. వర్మ విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ ను ఎక్కువ మంది తప్పు పట్టారు కూడా.
* కీలక శంకుస్థాపనలు..
అయితే ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Nagababu ). ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన తరఫున ఒక ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. పదవికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పిఠాపురం వచ్చారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే కూటమిలో ఒక పార్టీ ఇన్చార్జిగా ఉన్న వర్మను మాత్రం ఆహ్వానించలేదు. ఇది వారి అభిమానుల్లో కలచివేసింది. అందుకే నాగబాబును టిడిపి శ్రేణులు నిలదీసినంత పని చేశాయి. ఆ వివాదం అలా కొనసాగుతున్న తరుణంలో తాజాగా పిఠాపురం వర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
* ప్రజా దర్బార్లో కామెంట్స్
పిఠాపురం నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. టిడిపి తరఫున నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వర్మ( Pithapuram Varma) మాట్లాడారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి లోకేష్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించలేదు. తద్వారా నాగబాబు జనసేన ఆవిర్భావ సభలో చేసిన కామెంట్స్ కు.. ధీటుగా ఇప్పుడు వర్మ వ్యాఖ్యలు చేసినట్లు అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
వర్మ మాటలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించించేనా!
యువగళం పాదయాత్ర వల్లే #TDP అధికారంలోకి వచ్చింది.
పార్టీకి 2047 ప్రణాళిక అవసరం. దీనిపై #Chandrababu ఆలోచించి పార్టీ సారథిగా లోకేశ్‌ను నియమించేలా చర్యలు తీసుకోవాలి – @SVSN_Varma pic.twitter.com/goauYFB798
— greatandhra (@greatandhranews) April 9, 2025