CM Chandrababu: ఏపీలో ( Andhra Pradesh)ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయ్యింది. ఈనెల 20న ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమి మెజారిటీతో ఉండడంతో ఐదు స్థానాలు ఆ మూడు పార్టీలకే దక్కనున్నాయి. అయితే ఇప్పటికే జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు నామినేషన్ వేశారు. మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ పదవులు టిడిపికి దక్కుతాయని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో బిజెపి కోరిక మేరకు ఒక పదవి విడిచి పెట్టాల్సి వచ్చింది. టిడిపికి మిగిలిన ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. ఆశావహులకు షాక్ ఇస్తూ.. వివిధ సమీకరణలో భాగంగా ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశారు. దాదాపు ఓ 20 మంది వరకు ఆశావహులు టిడిపిలో ఉండేవారు. ఈ ప్రకటనతో వారు నీరుగారిపోయారు. అయితే సామాజిక సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. నామినేషన్ కు చివరి రోజు కావడంతో ఈరోజు ఆ ముగ్గురు దాఖలు చేయనున్నారు.
Also Read: టీడీపీ MLC అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు..ఊహించని లిస్ట్ ఇది..పిఠాపురం వర్మ కి మళ్ళీ నిరాశే!
* వారికి లేనట్టే
రాష్ట్రంలో( state) పొత్తులో భాగంగా మూడు పార్టీలు కలిసి వెళ్లాయి. ఈ క్రమంలో టిడిపి నుంచి చాలామంది నేతలు టికెట్లను త్యాగం చేశారు. అటువంటి వారికి ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది. ఎవరికి వారుగా గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు అవేవీ పరిగణలోకి తీసుకోలేదు. ముగ్గురు నేతలను అనూహ్యంగా ఎంపిక చేశారు. అయితే ఈ ముగ్గురు ఎంపిక వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. పార్టీకి పనికొచ్చారని, పనికొస్తారని భావించి వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
* ఈరోజు నామినేషన్లు
బీద రవిచంద్ర( Ravichandra ), బీటీ నాయుడు, కావలి గ్రీష్మ ప్రసాద్ లను ఎంపిక చేశారు చంద్రబాబు. వారు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బీద రవిచంద్ర యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. పార్టీకి కష్టకాలంలో సైతం అండగా నిలబడుతూ వచ్చారు. ఆయన సోదరుడు మస్తాన్ రావు ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవి కూడా వదులుకున్నారు. టిడిపిలో చేరి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన సోదరుడికి ఎమ్మెల్సీ పదవి దక్కడం విశేషం. మరోవైపు కావలి గ్రీష్మ ప్రసాదును ఎంపిక చేశారు చంద్రబాబు. ఈమె టిడిపి సీనియర్ నేత ప్రతిభాభారతి కుమార్తె. రాజాం నియోజకవర్గ టికెట్ ఆశించారు దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు చంద్రబాబు. మరోవైపు బీటీ నాయుడుకు మరో ఛాన్స్ ఇచ్చారు. రాయలసీమ జిల్లాకు చెందిన నాయుడు పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డారు. అందుకే ఆయనకు మరోసారి రెన్యువల్ ఇచ్చారు.
* ఆశావహులు అధికం..
ఈసారి టిడిపి ( Telugu Desam Party)నుంచి భారీగా ఆశావాహులు ఉన్నారు. పదుల సంఖ్యలో ఎమ్మెల్సీ పదవులు ఆశించారు. అందులో గత ఎన్నికల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. ఎమ్మెల్సీలుగా పదవీ విరమణ పొందిన వారు సైతం మరో ఛాన్స్ కోరుకున్నారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా వారందరికీ చెక్ చెప్పారు. అనూహ్యంగా ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో టీడీపీలో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ప్రచారం నడుస్తోంది.