Nagababu: మంచి విజయానందంతో ఉన్నారు మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Naga babu ). ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన ఆయన ఎన్నిక లాంఛనమే. అటు తరువాత మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ క్యాబినెట్ లోకి నాగబాబును తీసుకుంటామని సీఎం చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడంతో నాగబాబును మంత్రిగా తీసుకోవడం ఖాయంగా తేలుతోంది. ఈ నెలాఖరుకు ఉగాది నాటికి నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. మంత్రిగా నాగబాబు ప్రమాణస్వీకారం చేస్తే.. మెగా కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్టే.
Also Read: టీడీపీ MLC అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు..ఊహించని లిస్ట్ ఇది..పిఠాపురం వర్మ కి మళ్ళీ నిరాశే!
* పవన్ కు అండగా మెగా బ్రదర్
నాగబాబు జనసేన లో ( janasena ) క్రియాశీలక పాత్ర పోషించారు. జనసేన అభివృద్ధికి కృషి చేశారు. పవన్ కళ్యాణ్ కు మెగా కుటుంబం నుంచి అండగా నిలిచిన తొలి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ కావడం విశేషం. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు నాగబాబు. ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులు పాటు సైలెంట్ అయ్యారు. కానీ మళ్లీ జనసేనలో క్రియాశీలకంగా మారారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేయాలని భావించారు. పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించడంతో నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
* కూటమికి మద్దతుగా ప్రచారం
2024 ఎన్నికల్లో కూటమితో( Alliance ) పాటు జనసేనకు మద్దతుగా ప్రచారం చేశారు నాగబాబు. నాగబాబు కుటుంబ ప్రచారంలో పాలుపంచుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు తప్పకుండా నామినేటెడ్ పదవి దక్కుతుందని అంతా భావించారు. తొలుత టీటీడీ చైర్మన్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు ప్రచారం నడిచింది. అయితే నాగబాబు దానికి సున్నితంగా తిరస్కరించారని.. పెద్దల సభకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని కూడా టాక్ నడిచింది. ఈ తరుణంలో మూడు రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో కూడా నాగబాబు పేరు చివరి వరకు వినిపించింది. అయితే సమీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. దీంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రకటన చేశారు. నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
* ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో
ప్రస్తుతం ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన నాగబాబు ఎన్నిక లాంఛనమే. ఈ తరుణంలో నాగబాబు కీలక కామెంట్స్ చేశారు. జనసేన పార్టీని ఇండియా జట్టుతో( Indian cricket team) పోల్చారు. తాజాగా ఇండియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువిరుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్పందించారు నాగబాబు. ఇండియన్ క్రికెట్ టీం తో జనసేనకు దగ్గర సంబంధాలు ఉన్నాయని.. పోలికలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. 12 సంవత్సరాల తరువాత ఒక్కసారి కూడా టాస్ గెలవకుండా ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా జట్టు సొంతం చేసుకుందని గుర్తు చేశారు. ఒక్క ఎమ్మెల్యే లేకుండా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం 100% స్ట్రైక్ రేట్ తో జనసేన విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. రాజ్యాధికారంలో పాలుపంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మొత్తానికైతే ఇండియా జట్టుతో జనసేన ను పోల్చడం విశేషం.