Champions Trophy: లీగ్ దశలో పాకిస్తాన్ జట్టు డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో తొలి మ్యాచ్ న్యూజిలాండ్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తదుపరి మ్యాచ్ దుబాయ్ వేదికగా భారత జట్టుతో పాకిస్థాన్ తల పడింది. ఈ మ్యాచ్ లోనూ పాకిస్తాన్ ఓటమిపాలైంది. ఈ ఓటమి ద్వారా పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.. బంగ్లాదేశ్ తో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఉండిపోవడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ జట్టులో గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సొంత మైదానాల్లోనూ పాకిస్తాన్ జట్టు ప్రతి చూపలేకపోవడంతో.. ఆ జట్టు ఆటగాళ్లపై పాక్ అభిమానులు దుమ్మెత్తి పోశారు. దీంతో తదుపరి న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్ కు బాబర్ ఆజామ్ కు పాకిస్తాన్ మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు.
ఏకిపారేస్తున్నారు
టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో నెటిజన్లు పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లను ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టీమిండియా వరుస విజయాలు సాధించింది. బలమైన జట్లను ఓడించింది. 2017లో ఎదురైన ఓటమికి 2025లో బదులు తీరుచుకుంది. 8 సంవత్సరాల గ్యాప్ వచ్చినా టీమిండియా ఆటగాళ్లు తమ ఆట తీరును అదేవిధంగా కొనసాగించారు. అయితే ఈసారి ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడారు. వత్తిడిలో ఇబ్బంది పడకుండా బ్యాటింగ్ చేశారు. సింగిల్స్ తీస్తూ ప్రత్యర్థి జట్టను ఇబ్బంది పెట్టారు. ఇలా గేమ్ ప్లాన్ మార్చడం వల్లే టీమిండియా ఛాంపియన్ అయింది. కానీ దీనిని కొనసాగించడంలో పాకిస్థాన్ విఫలమైంది. అందువల్లే గ్రూప్ దశ లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చినప్పటికీ.. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చివరికి మీకు మిగిలింది ఇదే అంటూ నెటిజన్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అందులో బాబర్ ఆజాం డ్రమ్ము కొడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్లు బాబర్ కు ఇదే కరెక్ట్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ జట్టు మారాలని.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ వ్యవహార శైలి మార్చుకోవాలని.. భారత్ పై కడుపు మంట తగ్గించుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
Jeet Gaye… #ChampionsTrophy2025#INDvsNZ pic.twitter.com/8lSpLlhHLS
— Jo Kar (@i_am_gustakh) March 9, 2025