Chandrababu Jail Food: చంద్రబాబు జైల్లో తీసుకున్న ఫస్ట్‌ ఆహారం ఇదే !

టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్పాహారంగా సిబ్బంది సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు ఫ్రూల్‌ సలాడ్‌ను అల్పాహారంగా పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్‌ కాఫీ కూడా సిబ్బంది తీసుకెళ్లారు.

Written By: Raj Shekar, Updated On : September 11, 2023 1:33 pm

Chandrababu Jail Food

Follow us on

Chandrababu Jail Food: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రికి ఏసీబీ కోర్టు ఆదివారం రిమాండ్‌ విధించింది. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజమండ్రి జైలుకు పంపించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత చంద్రబాబును రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉంచారు. ఖైదీ నంబర్‌ 7691 కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు ప్రత్యేక గది కూడా కేటాయించారు. ఇక ఇంటి నుంచి ఆహారం కూడా అందించేందుకు కోర్టు అనుమతి వ్వడంతో సోమవారం ఉదయం అల్పాహారం ఇంటి నుంచే పంపించారు.

ఫ్రూట్‌ సలాడ్‌..
టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్పాహారంగా సిబ్బంది సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు ఫ్రూల్‌ సలాడ్‌ను అల్పాహారంగా పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్‌ కాఫీ కూడా సిబ్బంది తీసుకెళ్లారు.

14 రోజుల రిమాండ్‌..
స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో అరెస్టయిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. చంద్రబాబు ఆరోగ్యరీత్యా ఆయనకు ఇంటి వద్ద నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించింది. ప్రత్యేక వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్నందున ప్రత్యేక గది కేటాయించి, ప్రత్యేక భద్రత కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ప్రశ్నించేందుకు వీలుగా చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. సెంట్రల్‌ జైలులోని ‘స్నేహ’ బ్లాక్‌ను చంద్రబాబు కోసం కేటాయించారు. బ్లాక్‌ చుట్టూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్యూటీ సిబ్బంది మినహా ఎవరినీ అటువైపు వెళ్లనీయడం లేదు.

జైలు వద్ద అదనపు సీసీ కెమెరాలు..
ఇదిలా ఉండగా రాజమండ్రి జైలు వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఇప్పటికే జైలుకు వచ్చే రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఎవరినీ జైలువైపు రానివ్వడం లేదు. ఇక జైలు బయట ప్రస్తుతం ఒక సీపీ కెమెరా మాత్రమే ఉంది. చంద్రబాబు ఇదే జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న దృష్టా తాజాగా భద్రత పెంచుతున్నారు. ఇందులో భాగంగా జైలు చుట్టూ సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా.. గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు.