Minister Roja: చంద్రబాబు రిమాండ్‌.. పండుగ చేసుకున్న మంత్రి రోజా.. వీడియో వైరల్‌!

చంద్రబాబు అంటేనే మండిపడే వైసీపీ రాజకీయ నేతల్లో ఒకరైన రోజా.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయనపై పలు సెటైర్లు వేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 11, 2023 1:54 pm

Minister Roja

Follow us on

Minister Roja: టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ.. ఆదివారం ఏసీబీ కోర్టులో హాజరు పర్చి.. రిమాండ్‌ కు పంపింది. దీంతో 36 గంటలపాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. ముఖ్యంగా ఏపీ మంత్రి ఆర్కే.రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వరుసగా విమర్శలు గుప్పించిన మంత్రి ఆర్కే.రోజా.. ఏసీబీ కోర్టు తీర్పు కోసం ముందు నుంచే ఎదురుచూశారు. తీర్పు కచ్చితంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తుందని, రిమాండ్‌ విధిస్తారని ఊహించిన ఆమె స్వీట్లు, బాణాసంచా రెడీ చేశారు. ఇలా తీర్పు ప్రకటించగానే వెంటనే తన ఇంటికి వచ్చిన కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచుతూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు.

బాబుపై విమర్శల దాడి..
చంద్రబాబు అంటేనే మండిపడే వైసీపీ రాజకీయ నేతల్లో ఒకరైన రోజా.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయనపై పలు సెటైర్లు వేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వానికీ, వైసీపీ ప్రభుత్వానికీ తేడా గుర్తుచేస్తూ ఆమె వేసే సెటైర్లు సీఎం జగన్‌ను కూడా పలుమార్లు ఆకట్టుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబుపై రోజా చేస్తున్న మాటల దాడి మరింత ఎక్కువైంది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుపై విమర్శలతోనే ఆమె మంత్రి కూడా అయ్యారనే ప్రచారం కూడా ఉంది.

బాబుపై కసి..
చంద్రబాబుపై రోజాకు బాగా కసి ఉంది. ఎందుకంటే.. ఆమెను ఐరెన్‌ లెగ్‌గా టీడీపీ ప్రచారం చేసింది. రోజా ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అధికారంలోకి రాదనే ముద్ర వేసింది. కానీ, దానిని రోజా 2019 బద్ధలు కొట్టారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్న రోజాపై చంద్రబాబు సర్కార్‌ సస్పెన్షన్‌ వేటు వేసి వేధించింది. కోర్టు రోజాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. అసెంబ్లీలోకి రాన్వికుండా రోడ్డుపై కూర్చోబెట్టారు. మహిళా ఎమ్మెల్యేలు అయితే.. వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. దీంతో రోడ్డుపై కన్నీరు పెట్టుకున్న రోజా.. బాబు పతనం కోసం ఎదురు చూస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతోనే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న రోజా.. తాజాగా చంద్రబాబును జైలుకు పంపడంతో మరోసారి పండుగ చేసుకున్నారు.
దీంతో సహజంగానే ఇవాళ చంద్రబాబు తొలిసారి జైలుకు వెళ్తుండటంతో రోజా సంబరాలు మిన్నంటాయి. ఉదయం కూడా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన తప్పులకు శిక్ష పడుతోందంటూ వ్యాఖ్యానించారు. ఏసీబీ కోర్టు తీర్పు వచ్చాక ఇదే విషయం మరోసారి చెప్పారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్వేగానికి కూడా లోనయ్యారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రోజా అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ అయ్యారు.