https://oktelugu.com/

YCP: జగన్ ను ఇరుకున పెడుతున్న వైసీపీ నేతలు.. రేవంత్ కన్నెర్రజేస్తే

తెలుగు రాష్ట్రాల్లో రెండు రాజకీయంగా విరుద్ధ ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి తెలంగాణలో ఉన్న ప్రభుత్వం అనుకూలంగా ఉండాలి. కానీ వైసీపీ నేతలు అలా భావించడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : December 27, 2024 / 10:25 AM IST

    YCP Party

    Follow us on

    YCP: వైసీపీ నేతలు లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నారు. అధినేత జగన్ ను కష్టాల్లో పడేస్తున్నారు.ప్రస్తుతం జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లి కి రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ ముఖం పెద్దగా చూడడం లేదు. అయితే అక్కడ తన ప్రత్యర్థి చంద్రబాబుకు అనుకూల ప్రభుత్వం ఉందని.. అక్కడ అయితే కష్టాలు తప్పవని జగన్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ… ఆది నుంచి రేవంత్ విషయంలో జగన్ కాస్త భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. రేవంత్ సీఎం అయినప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. దాయాది రాష్ట్రం సీఎం అయినప్పుడు గౌరవప్రదంగా అభినందించాలి. కానీ జగన్ ఆ పని కూడా చేయలేదు. ఇదే విషయాన్ని రేవంత్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అటు తరువాత రేవంత్ విషయంలో వైసీపీ నేతలు అనేక రకాల విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఆ విమర్శల దాడి తగ్గింది.కానీ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలను ముడిపెట్టి వైసీపీ నేతలు తెగ రెచ్చిపోతున్నారు. నేరుగా రేవంత్ పైనే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు వైసీపీ తీరుపై భగ్గుమంటున్నాయి.

    * అంబటి సంచలన ట్వీట్
    తెలంగాణలో బెనిఫిట్ షోల ప్రదర్శన,టికెట్ల ధర పెంపును రేవంత్ సర్కార్ నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమ పెద్దలు నేరుగా కలిసి రేవంత్ కు విజ్ఞప్తి చేసిన నిర్ణయంలో మార్పు లేదని ఆయన తేల్చి చెప్పిన విషయం విధితమే. అయితే దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సోఫా రావాల్సిందేనని ట్వీట్ చేశారు. అంటే రేవంత్ కు ముడుపులు ఇచ్చుకోవాల్సిందేనట్టు ఇన్ డైరెక్ట్ గా ఆరోపణలు చేశారు.రేవంత్ లంచగొండి అని.. ఆయన డబ్బులు వసూలు చేయడానికి ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇక అధికార ప్రతినిధిగా నియమితురాలైన శ్యామల సైతం రేవంత్ పై అనుచిత కామెంట్స్ చేశారు.

    *అయితే వ్యూహాత్మకమా?
    అయితే ఒక విషయాన్ని వైసిపి నేతలు గమనిస్తున్నారు. తమ అధినేత జగన్ ఆస్తులు, బినామీ ఆస్తులు తెలంగాణలో ఉన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. ఒకవేళ రేవంత్ రెడ్డి కన్నెర్ర జేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియనిది కాదు. అయినా సరే వైసీపీ నేతలు ఒకేసారి రేవంత్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక వ్యూహం ఏంటన్నది తెలియడం లేదు. కేవలం చంద్రబాబుకు సన్నిహితుడు అన్న కోణంలోనే ఆరోపణలు చేస్తున్నారా? లేకుంటే నిజంగానే రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారా? అన్నది వైసీపీ హై కమాండ్ క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.