https://oktelugu.com/

Budget 2025: బడ్జెట్‌ 2025–26: మధ్య తరగతికి బిగ్‌ రిలీఫ్‌.. రూ.15 లక్షల వరకు పన్ను తగ్గింపు..!

కేంద్ర బడ్జెట్‌ 2025–26 వ్యూహాలపై నీతి ఆయోగ్‌లోని ప్రముఖ ఆర్థికవేత్తలు మరియు ఆలోచనాపరుల బృందంతో గత మంగళవారం(డిసెంబర్‌ 24న) కూడా ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం(డిసెంబర్‌ 26న) నాలుగో ప్రీ బడ్జెట్‌ సంప్రదింపులకు అధ్యక్షత వహించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 27, 2024 / 10:31 AM IST

    Budget 2025

    Follow us on

    Budget 2025: కేంద్రం ఏటా ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. 2025–26 వార్షిక బడ్జెట్‌లోనూ అదే సంప్రదాయం కొనసాగించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో నిపుణులు, ఆర్థిక వేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. విన్నపాలను అందుకుంటోంది. 2025 బడ్జెట్‌లో ప్రజలపై పన్ను భారం తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. ఈ బడ్జెట్‌లో మధ్య తరగతికి ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయని పేర్కొంది. రూ.15 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారికి ఇన్‌కమ్‌ట్యాక్స్‌ భారం తగ్గించాలే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.

    ప్రస్తుతం ఇలా…
    ప్రస్తుతం దేశంలో రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షలోపు ఆదాయం ఉన్నవారికి 5 నుంచి 20 శాతం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. పన్ను రేట్లు తగ్గిస్తే లక్షల మందికి భారం తగ్గుతుంది. రూ.15 లక్షల వరకు పన్ను రేట్లలో ఎంత తగ్గిస్తారనే విషయంపై స్పష్టత లేదు. కానీ యూనియన్‌ బడ్జెట్‌లో తగ్గిపు ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో రూ.15 లక్షలకుపైగా వార్షిక ఆదాయం ఉన్నవారిపై పన్ను భారం 30 శాతంగా ఉంది. దానిని యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది.

    వినియోగానికి బూస్ట్‌..
    దేశ ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉంది. నగరాలు, పట్టణాల్లో వినియోగం తగ్గిపోయి ఆందోళన కలిగించేలా ఉంది. ఈ నేపథ్యంలో పన్నుల భారాన్ని తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉంది. తద్వారా ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బులు చేరి వినియోగానికి బూస్ట్‌ వస్తుందని భావిస్తోంది. పన్ను భారం తగ్గితే వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తోంది. అయితే ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
    రెండు పన్ను విధానాలు..
    ఇక ప్రస్తుతం దేశంలో రెండు పన్ను విధానాలు ఉన్నాయి. పాత పన్ను విధానంలో వివిధ పెట్టుబడులు, ఖర్చులపై పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇక 2020లో తెచ్చిన కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి పెట్టుబడులపై మినహాయింపు కల్పించలేదు. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంలోనూ పన్ను మినహాయింపులు ఇవ్వాలని ట్యాక్స్‌ పేకయర్లు కోరుతున్నారు.

    పాత పన్ను విధానంలో..
    పాత పన్ను విధానంలో రూ.2.50 లక్షల వరకు ఆదాయం ఉన్నవారిపై ఎలాంటి పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారిపై 5 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్నవారిపై 20 శాతం పన్ను. రూ.10 లక్షలకన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్ను విధిస్తారు. ఈ పన్ను విధానంలో వివిధ పెట్టుబడులు, ఇన్సూరెన్స్‌ వంటివాటిపై మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

    కొత్త పన్ను విధానం…
    ఇక కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరు 15 శాతం, 12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాం పన్ను, రూ.15 లక్షలకన్నా ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. కొత్త పన్ను విధానంలో రేట్లు తక్కువగా ఉండడంతో మధ్యతరగతివారు ఈ విధానాన్నే ఎంపిక చేసుకుంటున్నారు.