Jagan Latest News: ఏపీలో( Andhra Pradesh) కూటమి 17 నెలల పాలన పూర్తి చేసుకుంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయంలో స్పష్టత రావడంతో రాష్ట్రంలోని మిగతా పార్టీలు తమ స్టాండ్ ను మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్. అంతే సమానంగా వామపక్షాలు కూడా ఉంటాయి. సిద్ధాంతపరంగా తీవ్రంగా విభేదిస్తుంటాయి. ప్రస్తుతం ఏపీలో టిడిపి కూటమిలో బిజెపి ఉంది. అందుకే ఆ కూటమికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో చేరేందుకు వామపక్షాలు ఆలోచిస్తున్నాయి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. తనను బలహీనపరిచి వైసీపీ ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ ఆకూటమిలో చేరే అవకాశం లేదు.
ఒంటరి పోరాటం స్లోగన్..
జగన్మోహన్ రెడ్డి తో( Y S Jagan Mohan Reddy ) పాటు ఆ పార్టీ శ్రేణుల ప్రధాన నినాదం ఒంటరి పోరాటం. దమ్ముంటే ఒంటరిగా పోరాటం చేయండి అనే సవాళ్లు వినిపిస్తుంటాయి. సోషల్ మీడియాలో సైతం వైసీపీ నుంచి వచ్చిన మాట ఇదే. ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒంటరి పోరాటం అనే నినాదాన్ని గట్టుమీద పెట్టి తమతో కలిసి వచ్చే పార్టీలు ఏమిటి అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. అది కూడా ప్రభుత్వం పై ప్రచారం, ప్రభుత్వాన్ని నిందించే పార్టీలకు మాత్రమే స్నేహ హస్తం అందించాలి. ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి సీట్లు ఇవ్వకూడదు. అంటే కూటమి ప్రభుత్వం పై విష ప్రచారం వరకే పొత్తు. పోటీ మాత్రం ఒంటరిగానే చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అయితే దీనికి వామపక్షాలు అంగీకరించే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా చేరదు. ఇప్పుడు ఉన్న పార్టీలు బీఎస్పీ, అమ్ ఆద్మీ, వంటి చిన్నాచితక పార్టీలే ఉన్నాయి.
బిజెపితో తెర వెనుక స్నేహం..
వామపక్షాలు జగన్మోహన్ రెడ్డి వైపు అనుమానంగా చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రధాన శత్రువు టిడిపి, చంద్రబాబు.. రెండో శత్రువు పవన్ కళ్యాణ్, జనసేన… కానీ బిజెపిని మాత్రం శత్రువుగా చూడరు, ప్రత్యర్థిగా మాట్లాడరు. ఇదే వామపక్షాలకు నచ్చడం లేదట. బిజెపితో తెరవెనుక స్నేహం చేసి.. టిడిపి తో పాటు జనసేన లను గద్దె దించేందుకు తమ సహకారం కోరడంపై వామపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. టిడిపి, జనసేనతో పాటు బిజెపిని ఉమ్మడి శత్రువుగా చూస్తేనే.. వైసిపి తో కలిసి పోరాడేందుకు వామపక్షాలు సిద్ధపడతాయట. అంతవరకు జగన్మోహన్ రెడ్డి పిలిచినా.. పలికే స్థితిలో వామపక్షాలు లేవు. అయితే వైసిపి కూటమి కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్న అయితే వైసిపి కూటమి కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్న.. ఒంటరి పోరాటం అనే స్లోగన్ అడ్డువస్తోంది. ఆపై వామపక్షాలు బిజెపి తో పరోక్ష స్నేహాన్ని జగన్ వదులుకుంటేనే అన్న షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.
