1 lakh Mahesh fans: కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు నవంబర్ నెల వస్తుందా అని ఆతృతగా ఎదురు చూసారు. ఎందుకంటే ఈ నెలలోనే మహేష్(Superstar Mahesh Babu),రాజమౌళి(SS Rajamouli) మూవీ కి సంబంధించిన అప్డేట్ రానుంది. దీని గుర్తు చేస్తూ నవంబర్ 1న రాత్రి మహేష్ బాబు ట్విట్టర్ లో రాజమౌళి ని ట్యాగ్ చేస్తూ మాట్లాడిన మాటలను అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక మహేష్ ట్వీట్ కి రాజమౌళి రెస్పాన్స్ ఇవ్వడం, ఆ తర్వాత ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ వంటి వారు కూడా ఈ చర్చ భాగం అవ్వడం వంటివి మనమంతా చూసాము. ఒక వాట్సాప్ గ్రూప్ లో స్నేహితులు ఎలా అయితే చిట్ చాట్ చేసుకుంటారో, ట్విట్టర్ లో వీళ్లంతా సరదాగా అలా చిట్ చాట్ చేసుకున్నారు. చూసేందుకు ఈ సంభాషణ మొత్తం చాలా ఫన్నీ గా అనిపించింది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్/ గ్లింప్స్ వీడియో ని ఈ నెల 15 వ తారీఖున రామోజీ ఫిలిం సిటీ లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేయబోతున్నారట. ఈ ఈవెంట్ కి సుమారుగా లక్ష మంది మహేష్ అభిమానులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయట. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నట్టు సమాచారం. ఈ ఈవెంట్ ని జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఇప్పటి నుండి దీనికి సంబంధించిన చిన్న వీడియో బిట్ ని తెగ ప్రమోట్ చేస్తోంది హాట్ స్టార్ టీం. ప్రొమోషన్స్ విషయం లో రాజమౌళి ఒక మాస్టర్ అని చెప్పడానికి ఇదొక నిదర్శనం గా తీసుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే, ఇక సినిమా విడుదల సమయానికి ఏ రేంజ్ లో ఉంటాడో ఊహించుకోవచ్చు. ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
ఎందుకంటే షూటింగ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. అయితే ఫస్ట్ లుక్ కి లీక్ అయినా ఫోటోలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు టాక్. అంతే కాకుండా నవంబర్ 15న రాజమౌళి తో ఇప్పటి వరకు పని చేసిన ప్రతీ స్టార్ హీరో హాజరు కాబోతున్నారని టాక్. అయితే మొన్నటి వరకు ఈ ఈవెంట్ కి అవతార్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి ఎప్పటి లాగానే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ని కూడా మీడియా కి చెప్పబోతున్నాడట.