Bigg Boss 9 Telugu Nominations: రోలర్ కోస్టర్ లాంటి ఎమోషన్స్ మధ్య సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) అప్పుడే 8 వారాలు పూర్తి చేసుకుంది. 8 వ వారం లో దివ్వెల మాధురి ఎలిమినేట్ అయ్యింది. తనూజ తన వద్ద ఉన్నటువంటి సేవింగ్ పవర్ ని ఉపయోగించి మాధురి ని సేవ్ చేస్తుందని అంతా ఊహించారు కానీ, మాధురి నే నాకు ఉపయోగించవద్దు అని చెప్పడంతో ఆమె ఎలిమినేషన్ అలా సాగింది. ఇక హౌస్ లో సేఫ్ గేమ్స్ ఆడేందుకు స్కోప్ మొత్తం పోయింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా వెళ్లిపోతుండడం వల్ల, ప్రస్తుతం ఉన్న వారిలో ఎంతటి రిలేషన్స్ ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి తనూజ, ఇమ్మానుయేల్ మంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే గత మూడు వారాల నుండి వీళ్లిద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదు. తానూ మొదటి నుండి తనూజ కి సపోర్ట్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా తనూజ నాకు ఇమ్మానుయేల్ ఎటువంటి సపోర్ట్ చేయడం లేదని చెప్పడం దగ్గర నుండి వీళ్ళ మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెంచుతూ వచ్చింది. ఇప్పుడు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ వారం కూడా నామినేషన్స్ లో వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందట. తనూజ ఇమ్మానుయేల్ ని నామినేట్ చేసిందా?, లేదా ఇమ్మానుయేల్ తనూజ ని నామినేట్ చేశాడా అనేది తెలియదు కానీ, వీళ్లిద్దరి మధ్య మాత్రం నేడు నామినేషన్స్ లో తాడో పేడో అనే రేంజ్ గొడవ జరిగిందట. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే తనూజ, భరణి మధ్య కూడా నామినేషన్స్ లో పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది.
తనూజ కి భరణి మీద ఎంత ప్రేమ ఉందో మనమంతా చూస్తూ వచ్చాము. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, తనూజ భరణి ని నామినేట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భరణి ప్రతీ మ్యాటర్ లో దివ్య తలదూర్చి మాట్లాడడం తనూజ కి అసలు నచ్చడం లేదు. ఇది జనాలకు వేరుగా అర్థం అవ్వడం వల్లే మీరు నెగిటివ్ అయ్యి ఎలిమినేట్ అయ్యారు అని తనూజ శనివారం ఎపిసోడ్ లో కూడా భరణి ని దగ్గరకు పిలిచి వివరణ ఇస్తుంది. అయినప్పటికీ భరణి దివ్య కు బలంగా ఈ విషయాన్నీ చెప్పలేకపోతున్నాడు. ఈ విషయం లోనే భరణి ని తనూజ నామినేట్ చేసిందని, ఇక్కడ కూడా దివ్య మధ్యలో తలదూర్చడంతో, ఆమెకు, దివ్యకు మధ్య కూడా పెద్ద గొడవ జరిగిందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. చూడాలి మరి ఈ నామినేషన్స్ ఎపిసోడ్ ఎంత ఫైర్ మీద ఉండబోతుంది అనేది.