ఆంధ్రప్రదేశ్‌Thammineni Seetharam: తమ్మినేని ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు!

Thammineni Seetharam: తమ్మినేని ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు!

Thammineni Seetharam: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం చుట్టూ ఇప్పుడు భూ కబ్జా కుట్ర కేసు ఆలుముకుంది. ఒక భూమికి సంబంధించి యజమాని ప్రాణాలతో ఉండగానే.. ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి.. తప్పుడు వారసత్వ పత్రాలు ఆధారంగా విలువైన భూమిని కొట్టేయాలని చూశారనేది తమ్మినేని పై నమోదైన కేసు సారాంశం. అసలు యజమాని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి తమ్మినేని కుటుంబం చేసిన కుట్రను ఛేదించారు. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో తమ్మినేని సీతారాం తో పాటు కుటుంబ సభ్యుల పేర్లను నిందితులుగా చేర్చారు.

* అధికారంలో ఉండగానే..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో స్పీకర్ గా పని చేశారు తమ్మినేని. ఆ సమయంలోనే ఈ భూకబ్జా కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. అసలు యజమాని బతికుండగానే ఆయన పేరుతో వారసులను సృష్టించి.. నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేయించారనేది పోలీసుల దర్యాప్తులో తేలిన అంశం. ఈ కేసులో తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ను ఐదో నిందితుడిగా.. తమ్మినేని సీతారాంను ఆరో నిందితుడిగా.. ఆయన భార్య తమ్మినేని వాణిని ఏడో నిందితురాలిగా పోలీసులు కేసులో చేర్చారు. అధికారంలో ఉన్నప్పుడే ఈ ఫోర్జరీ లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసు వివరాలను బయటపెట్టారు. నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ, భూకబ్జ కుట్రతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులకు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

* సుదీర్ఘ నేపథ్యం..
తమ్మినేని సీతారాం సుదీర్ఘ రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో పని చేసిన ఆయన కొద్ది రోజులపాటు ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ తెలుగుదేశంలోకి వచ్చి.. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా కూడా పని చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు పోటీ చేసి.. ఒకసారి మాత్రమే గెలిచారు. జగన్మోహన్ రెడ్డి తమ్మినేని పార్టీ నుంచి దూరం పెట్టారు. ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ఒకానొక దశలో తమ్మినేని జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అక్కడ ఛాన్స్ లేకుండా పోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. మరి తాజాగా భూకబ్జా కేసు నమోదైన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Thammineni Seetharam And Duvvada Srinivas: వైసిపి వద్దనుకున్న నేతతో సీనియర్ నాయకుడు చెట్టపట్టాల్!

Thammineni Seetharam And Duvvada Srinivas: శ్రీకాకుళం ( Srikakulam)జిల్లాలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఆ జిల్లా విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ధర్మాన ఫ్యామిలీకి...

Dharmanna and Thammineni: తమ్మినేనికి టిక్కెట్ లేదంటున్న ధర్మాన.. మధ్యలో దువ్వాడ!

Dharmanna and Thammineni: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో క్రమశిక్షణ కట్టు దాటుతోంది. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు విషయంలో నేతలు చేస్తున్న ప్రకటనలు...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version