Vijayasai Reddy Reentry : ఏపీ రాజకీయాల్లో( Andhra Pradesh politics) మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చర్చకు తెర లేపారు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమై దాదాపు 6 నెలలు అవుతోంది. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. మూడేళ్ల పదవికి గుడ్ బై చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన రాజీనామా చేసిన స్థానానికి ఉప ఎన్నిక కూడా జరిగిపోయింది. అయితే కూటమికి అమ్ముడుపోయారని.. చంద్రబాబుకు లొంగిపోయారని ఇటీవల జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా అదే పనిగా విజయసాయిరెడ్డి పై విమర్శలు చేస్తూనే ఉంది. కానీ విజయసాయిరెడ్డి నుంచి ఆ స్థాయిలో రియాక్షన్ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించని.. ఇకపై కూడా విమర్శించబోనని విజయసాయిరెడ్డి మరో సంచలనానికి తెర తీశారు.
* బిజెపి పెద్దలతో సాన్నిహిత్యం..
జనవరిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress party ) రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉండగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. తరువాత ఆయన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇకనుంచి రాజకీయ సన్యాసం చేస్తానని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. అయితే తరచూ రాజకీయాల గురించి మాట్లాడేవారు. రాజకీయ వ్యాఖ్యానాలు చేసేవారు. దీంతో ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తారని.. బిజెపిలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. బిజెపి పెద్దలతో విజయసాయి రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆయన బిజెపిలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి విషయంలో సానుకూల ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also : విజయసాయిరెడ్డిని వదిలేదిలే.. పల్నాడు జిల్లాలో ఫిర్యాదు.. అరెస్టుకు రంగం సిద్ధం!
* మద్యం కుంభకోణంలో ఆరోపణలు..
ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam) ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. ప్రాథమిక ఆధారాల సేకరణ, కేసు నమోదు తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ కేసులో ఏ 5 నిందితుడిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే ఈ మొత్తం మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. తనకు అనుమతి ఇస్తే పూర్తిస్థాయి ఆధారాలు కూడా ఇస్తానని సిట్ కి ఆఫర్ ఇచ్చారు. విచారణకు కూడా హాజరయ్యారు. తరువాత కీలక అరెస్టులు జరిగాయి. తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డి దేనని ప్రచారం నడిచింది. ఈ పరిస్థితుల్లో జగన్ మీడియా ముందుకు వచ్చారు. విజయసాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విజయసాయిరెడ్డి ప్రత్యేక ప్రకటన ఇచ్చారు కానీ.. జగన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కోటరీ వల్లే తాను జగన్కు దూరమయ్యానని.. ఆయనపై ఒక్క వ్యాఖ్య కూడా చేయనని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. అయితే బిజెపిలో వెళ్లేందుకు దారులు మూసుకుపోవడం వల్లే ఇప్పుడు జగన్ విషయంలో విజయసాయిరెడ్డి సానుకూలతగా మాట్లాడుతున్నారని అనుమానాలు ఉన్నాయి.
* బిజెపిలో చేరుతారని ప్రచారం..
వాస్తవానికి బిజెపి లైన్లో విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) ఉన్నారని తెగ ప్రచారం నడిచింది. బిజెపి పెద్దలతో ఉన్న అనుబంధంతో ఆయన ఆ పార్టీలో చేరుతారని కూడా టాక్ నడిచింది. కానీ ఏపీలో కూటమి పెద్దల అభ్యంతరాలతో బిజెపి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు వైయస్సార్ కుటుంబంతో మూడున్నర దశాబ్దాల అనుబంధం విజయసాయిరెడ్డికి. కేవలం కోటరీ వల్లే తాను జగన్కు దూరమయ్యానని పలుమార్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే తాను టిడిపిలో చేరడానికి కూడా ప్రకటించారు. అటు బిజెపి చేర్చుకోకపోవడంతో జగన్ పిలిస్తే తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉండడంతో.. విజయసాయిరెడ్డి జగన్ కు సంకేతాలు పంపుతున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.