AP Minister :ఏపీ క్యాబినెట్ లో( AP cabinet ) ఆయన ప్రత్యేకం. మంత్రి అయిన తర్వాత కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. పొలానికి వెళ్లి వ్యవసాయం చేస్తారు. స్వయంగా పొలం పనులు చేస్తారు. అన్నింటికీ మించి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆదర్శ రైతుగా నిలిచారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నుంచి మూడోసారి గెలిచారు నిమ్మల రామానాయుడు. ప్రజల ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అందుకే సీఎం చంద్రబాబు తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. రామానాయుడుకు ఇష్టమైన నీటిపారుదల శాఖను కేటాయించారు. అయితే ఏ స్థాయికి ఎదిగినా.. తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని మాత్రం రామానాయుడు మరువరు. తాజాగా వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆదర్శ రైతుగా నిలిచారు.
* క్షణం తీరిక లేకపోయినా..
సాధారణంగా రాజకీయాలు అంటే క్షణం తీరిక ఉండదు. అందునా క్యాబినెట్ మంత్రి అంటే.. ఏ స్థాయిలో బిజీలో ఉంటారు అందరికీ తెలిసిందే. కానీ నిమ్మల రామానాయుడు( Nimmala Rama Naidu ) మాత్రం అంత బిజీ సమయంలో సైతం వ్యవసాయానికి తగిన సమయం కేటాయిస్తూ వస్తున్నారు. వారంలో నియోజకవర్గానికి రెండు రోజులపాటు కేటాయిస్తున్నారు. అలా నియోజకవర్గానికి వచ్చే క్రమంలో తన సొంత పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేస్తుంటారు. రబీలో భాగంగా తన పొలంలో దాల్వా వరి సాగుచేసి.. ఎకరానికి ఏకంగా 65 బస్తాల ధాన్యాన్ని పండించి ఆదర్శ రైతుగా నిలిచారు. తక్కువ పెట్టుబడి తోనే అధిక దిగుబడిని సాధించారు.
* మంత్రి అయినా..
తాను ఈ రాష్ట్రానికి మంత్రి నన్న దర్పం ఆయనలో కనిపించదు. కాస్త సమయం కుదిరితే పొలంలోకి వెళ్తారు. తానే స్వయంగా సస్యరక్షణ చేపడతారు. నాట్లు వేస్తారు. రసాయనాలు చల్లుతుంటారు. తనకున్న ఆరు ఎకరాల పొలంలో ఆల్వారకం వారిని సాగు చేశారు. వ్యవసాయ అధికారుల సూచనలతో స్వయంగా వ్యవసాయ పనుల్లో పాల్గొని.. పంట యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టారు. సకాలంలో నారు నాటడం, ఎరువులు, నీటి యాజమాన్యం, పురుగు మందుల వాడకం, నీటి ఎద్దడి నివారణ వంటి చర్యలకు ఎకరానికి 65 బస్తాల ధాన్యాన్ని పండించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడుకు ఆదర్శ రైతుగా వ్యవసాయ శాఖ ఎంపిక చేసింది.
* ధ్రువీకరించిన వ్యవసాయ శాఖ.. పాలకొల్లు( Palakollu ) వ్యవసాయ సహాయ సంచాలకురాలు అద్దాల పార్వతి, మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిమ్మల రామానాయుడు అధిక దిగుబడులు సాధించి ఆదర్శ రైతుగా నిలిచారని చెప్పుకున్నారు. రామానాయుడుకు పాలకొల్లు మండలం ఆగర్తి పాలెం లో ఆరెకరాలజీ వ్యవసాయ భూమి ఉంది. అందులో అరుదైన ఆల్వారకం వరి వంగడాలు వేసి.. ఎకరానికి 65 బస్తాల చొప్పున 6 ఎకరాల్లో 390 బస్తాలు దిగుబడి సాధించినట్లు తెలిపారు. రాష్ట్రమంత్రిగా బిజీగా ఉన్నా వ్యవసాయంపై తనకున్న మక్కువ చాటుకున్నారు నిమ్మల రామానాయుడు.
Also Read : ఇంతకంటే అవమానం ఉంటుందా? ఏపీలో ఆ మంత్రి చాంబర్ కు తాళం..!