Allu Arjun And Deepika Padukone: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) గత సంవత్సరం పుష్ప 2 (Pushpa 2) సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఆయన సాధించిన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెను అలజడి అయితే క్రియేట్ అయింది. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం బీట్ చేస్తూ ఆయన పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను సైతం బ్రేక్ చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన అట్లీ (Atlee) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. అయితే దీనికంటే ముందు సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) ఒక సినిమా చేయడానికి కమిట్ అయినప్పటికి అది పోస్ట్ పోన్ అయింది. ఇక త్రివిక్రమ్ తో కూడా సినిమా చేయాల్సి ఉన్నప్పటికి అది కూడా పోస్ట్ పోన్ అయింది. మొత్తానికైతే అట్లీతో సినిమాని సెట్ చేసుకున్నాడు… ఇక సందీప్ రెడ్డివంగా ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తో సినిమా చేస్తున్నాడు.
ఇక ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా చేసే అవకాశం చాలా వరకు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ కి, సందీప్ వంగ కి మధ్య కొంచెం చిన్నపాటి వివాదాలైతే వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. అందువల్లే స్పిరిట్ (Spirit) సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ దీపిక పదుకొనే ను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నాడు.
కానీ ఆమె పెట్టిన కండిషన్స్ తనకి నచ్చకపోవడంతో ఆమె ప్లేస్ లో త్రిప్తి డిమ్రి (Thripthi Dimri) ని హీరోయిన్ గా అనౌన్స్ చేశాడు. కానీ దీపిక సందీప్ వంగ మధ్య ఒక చిన్నపాటి యుద్ధం నడిచిందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ – అట్లీతో చేస్తున్న సినిమా విషయంలో దీపిక పదుకొనే ను హీరోయిన్ గా తీసుకోవాలని అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తోంది.
దీనికి కారణం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ కి అల్లు అర్జున్ కి మధ్య చిన్న విభేదాలు రావడం వల్ల సందీప్ తో దీపికా కి చిన్న వివాదాలు వచ్చిన నేపథ్యంలో సందీప్ మీద కోపంతోనే దీపిక ను తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి అల్లు అర్జున్ కి దీపిక పదుకొనే కి మధ్య అంత మంచి కెమిస్ట్రీ అయితే వర్కౌట్ అవ్వదు. మరి ఎందుకని అల్లు అర్జున్ తన సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు అయితే చేస్తున్నారు…