https://oktelugu.com/

నెల్లూరులో పది మంది బ్యాంక్ ఉద్యోగులు మిస్సింగ్.. చివరకు..?

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. పోలీసులు ఆ మిస్సింగ్ కేసుల గురించి దర్యాప్తు చేయగా దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో 10 మంది బ్యాంక్ ఉద్యోగులు మిస్ అయ్యారు. ఈ ఘటన గురించి దర్యాప్తు చేసిన పోలీసులు బ్యాంక్ ఉద్యోగులు క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు. సదాశివకోన జలపాతానికి ఉద్యోగులు విహారయాత్రకు వెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ ప్రాంతంలో సిగ్నల్స్ లేకపోవడంతో వాళ్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 2, 2020 / 08:03 PM IST
    Follow us on


    ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. పోలీసులు ఆ మిస్సింగ్ కేసుల గురించి దర్యాప్తు చేయగా దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో 10 మంది బ్యాంక్ ఉద్యోగులు మిస్ అయ్యారు. ఈ ఘటన గురించి దర్యాప్తు చేసిన పోలీసులు బ్యాంక్ ఉద్యోగులు క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు. సదాశివకోన జలపాతానికి ఉద్యోగులు విహారయాత్రకు వెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

    ఆ ప్రాంతంలో సిగ్నల్స్ లేకపోవడంతో వాళ్ల ఫోన్లు స్విఛాఫ్ అని వచ్చాయని ఎవరూ కంగారు పడవద్దని పోలీసులు చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు పదిమంది కనిపించకపోవడం, అందరి ఫోన్లు స్విఛాఫ్ కావడం నెల్లూరుజిల్లాలో కలకలం రేపింది. చివరకు ఫోన్ సిగ్నల్స్ కలవడంతో వాళ్లు ఎక్కడున్నారో తెలియడం వల్ల బ్యాంక్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న నెల్లూరు జిల్లాకు చెందిన బ్యాంక్ ఉద్యోగులు మొదట అడవిలో ట్రెక్కింగ్ కు వెళ్లి ఆ తరువాత ఆలయానికి వెళ్లాలని అనుకున్నారు.

    అయితే ట్రెక్కింగ్ ముగిసిన తర్వాత వాళ్లు ముందుగా మాట్లాడుకున్న ట్రాక్టర్ అనుకున్న సమయానికి అక్కడికి చేరుకోలేదు. దీంతో వాళ్లు ఆలస్యంగా అక్కడినుంచి గుడికి బయలుదేరారు. నెల్లూరు పోలీసులు చిత్తూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా చిత్తూరు పోలీసులు వారిని తిరుపతి వడమాలపేటకు వెళుతున్న సమయంలో గుర్తించారు. అదే సమయంలో ఫోన్ సిగ్నల్స్ కూడా కలిశాయి. చివరకు ఉద్యోగుల క్షేమ సమాచారం లభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.