స్మార్ట్ ఫోన్లలో మనం ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటి. మన నిత్య జీవితంలో వాట్సాప్ భాగమైపోయింది. ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి వాట్సాప్ కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఫేస్ బుక్ వాట్సాప్ ను కొనుగోలు చేసిన తరువాత అదిరిపోయే ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ లో అవతలి వ్యక్తులకు పంపిన మెసేజ్ లను నిర్ణీత సమయంలో డిలేట్ చేసే అవకాశం ఉంది. అయితే కొంత సమయం తరువాత ఆ మెసేజ్ లను డిలేట్ చేసే అవకాశం ఉండదు. ఈ సమస్యలను అధిగమించడానికి వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్సాప్ కొత్త ఫీచర్ ను ఎవరైతే ఎనేబుల్ చేసుకుంటారో మనం ఎంపిక చేసుకున్న పర్సనల్ మెసేజెస్, గ్రూప్ మెసేజెస్ కు ఏడు రోజుల వరకు కనిపిస్తాయి. వాట్సాప్ నుంచి ఈ మేరకు అధికారిక ధృవీకరించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియాల్సి ఉంది.
అయితే మనం పంపిన మెసేజెస్ మాత్రమే డిలేట్ అవుతాయని.. ఫార్వర్డ్ చేసిన మెసేజెస్ డిలేట్ కావని వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతూ ఉండటం గమనార్హం.