Telangana Special Train: తిరుమల( Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారు ఉంటారు. ఏడాదిలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని భావిస్తారు. సరైన ప్రణాళిక లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. సాధారణంగా సెలవు దినాల్లో, భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో శ్రీవారి దర్శనానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అయితే ఉద్యోగులు పని దినాలు, పిల్లల సెలవులు చూసుకుని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సరైన ప్రణాళిక లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. అయితే వీకెండ్స్ లోనే తిరుమల శ్రీవారి యాత్రను పూర్తిచేసుకుని.. వర్కింగ్ డే నాటికి విధులకు హాజరయ్యే సూపర్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో శ్రీవారిని దర్శించుకోవచ్చు.
Also Read: ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ రెడీ.. తేల్చుకోవాల్సింది జగనే!
భాగ్యనగరం నుంచి..
ముఖ్యంగా భాగ్యనగరం నుంచి తెలంగాణ( Telangana) ప్రజలు ఎక్కువగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఉత్తరాది రాష్ట్రాల వారు సైతం హైదరాబాద్ నుంచి ఎక్కువగా తిరుమల చేరుకుంటారు. అయితే ఇందులో ఉద్యోగుల విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. వారిని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది కేంద్ర రైల్వే శాఖ. వీకెండ్ లో స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని.. వర్కింగ్ డే నాటికి విధులకు హాజరయ్యేలా ప్లాన్ చేశారు. ప్రతి శుక్రవారం రాత్రి చర్లపల్లిలో 9:45 గంటలకు ఆ ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. రాత్రి 10:30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు అంటే శనివారం ఉదయం 11 గంటలకు తిరుపతికి చేరుతుంది CHZ TPTY SPL-07017 నంబరు గల ప్రత్యేక రైలు. హైదరాబాదు నుంచి బయలుదేరే భక్తులకు ఈ రైలు ద్వారా ఎంతో సౌలభ్యం ఉంది.
అక్కడే అన్ని ఏర్పాట్లు..
తిరుపతి( Tirupati) రైలు చేరుకోగానే స్టేషన్ పక్కనే ఉన్న విష్ణు నివాసంలో కాలకృత్యాలు తీసుకుని సిద్ధం కావచ్చు. అక్కడ భోజన సౌకర్యం కూడా ఉంటుంది. దర్శనం టోకెన్లు అక్కడే ఇస్తారు. టోకెన్ లో ఉన్న సమయం ప్రకారం స్వామి వారిని ఆదివారం రోజు దర్శనం చేసుకోవచ్చు. ఆ రాత్రి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళవచ్చు. ఒకవేళ టోకెన్లు దొరకకపోతే శనివారం సాయంత్రానికి దర్శనం లైన్లో నిలబడితే.. కచ్చితంగా ఆదివారం మధ్యాహ్నం పూర్తవుతుంది. అయితే స్వామి వారి దర్శనం రెండు వేల రూపాయలతోనే పూర్తి చేయవచ్చు. తక్కువ ఖర్చుతో లీవ్ పెట్టకుండా తిరుపతి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట.