Nani Upcoming Film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దసర సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) … ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తుండటం విశేషం… ఇక ఇప్పటికే ఆయన నానితో ప్యారడైజ్ (Paradise) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించే స్థాయిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా చాలా రా అండ్ రాస్ట్రిక్ట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించి పెడుతోంది. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: అట్లీ మూవీలో అల్లు అర్జున్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న స్టార్ హీరో…
ఇక నాని తల్లిగా రమ్యకృష్ణ నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్న శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) నాని అన్న పాత్రలో కన్నడ సూపర్ స్టార్ అన్న రిషబ్ శెట్టి చేత నటింప జేస్తున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట.
చాలా స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ పాత్ర కోసం మొదట చాలామందిని అనుకున్నప్పటికి చివరికి రిషబ్ శెట్టి తో ఈ పాత్రను చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ను సాధిస్తే స్టార్ స్టేటస్ ని అందుకుంటాడు. లేకపోతే మాత్రం భారీగా వెనుకబడి పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు.
Also Read: ఆ ఇద్దరు హీరోలు కాదు, అసలు సౌందర్య ప్రేమించింది ఎవరినో తెలుసా?
ఇంకా చిరంజీవి కూడా తనతో చేయాల్సిన సినిమాని కూడా చేయాలి అంటే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే దాని రిజల్ట్ ని బట్టి ఆయన తన తదుపరి ప్లాన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక చిరంజీవి తో సినిమా చేయాలంటే మాత్రం ఈ సినిమాను భారీ రేంజ్ లో చేసి సూపర్ సక్సెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ఇప్పటి వరకు ఆయన ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇప్పుడు చేయబోయే సినిమాలు ఆయన్ని నెక్స్ట్ లెవల్ లో నిలుపబోతున్నట్టుగా తెలుస్తోంది…