TDP MLC candidates : ఎట్టకేలకు టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు( TDP MLC candidates ) ఖరారు అయ్యారు. ఈనెల 20న ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు జనసేన తరపున నామినేషన్ వేశారు. మిగతా నాలుగు పదవులకు సంబంధించి టిడిపికి మూడు, బిజెపికి ఒకటి దక్కింది. ఈ తరుణంలో టిడిపి నుంచి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. అందులో రెండు స్థానాలు బిసి, ఒక సీటు ఎస్సీ కేటాయిస్తూ ప్రాంతీయ సమీకరణలను పరిగణలోకి తీసుకున్నారు. కాగా ఎస్సీ, ఆపై మహిళా అభ్యర్థిగా కావలి గ్రీష్మ కు అవకాశం దక్కింది. అయితే ఇప్పటికే గ్రీష్మ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్నారు. అయితే ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం ఇవ్వడం వెనుక చాలా రకాల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతి కుమార్తె కావడం కలిసి వచ్చింది.
Also Read : ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు -?
* లోకేష్ టీమ్ గా..
అయితే లోకేష్ టీంలో( Lokesh team) ఆమె కూడా ఒక సభ్యురాలేనని అప్పట్లో ప్రచారం నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టిడిపి శ్రేణులు ఇబ్బంది పడ్డాయి. ఆ సమయంలోనే గట్టిగానే వాయిస్ వినిపించే మహిళా నేతల్లో కావలి గ్రేష్మ ప్రసాద్ ఒకరు. ఏకంగా మహానాడు వేదికపైనే తొడగొట్టి మరి మాట్లాడారు. వైసిపి అరాచకాలను ఎదుర్కొంటామని సవాల్ చేశారు. నాడు చేసిన సవాల్ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి అక్కరకు వచ్చిందని తెలుస్తోంది. పైగా ప్రాంతీయ, సామాజిక సమీకరణల్లో ఆమెకు అనూహ్యంగా పదవి దక్కింది. చేతిలో రాష్ట్రస్థాయి పదవి ఉన్నా.. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మాత్రం వ్యూహాత్మకమని తెలుస్తోంది.
* ఆమె ఎంపిక అనూహ్యం
టిడిపి నుంచి ముగ్గురిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అందులో కావలి గ్రీష్మ ( grishma)ఎంపిక మాత్రం ఆసక్తికరంగా మారింది. గతంలో బీటీ నాయుడు, బీద రవిచంద్ర ఎమ్మెల్సీలుగా పనిచేశారు. కానీ తొలిసారిగా ఛాన్స్ దక్కించుకున్నారు గ్రీష్మ. ఆమె తల్లి ప్రతిభాభారతి సీనియర్ నేత. 1983 నుంచి 1999 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఉమ్మడి ఏపీ శాసనసభ మహిళా స్పీకర్ గా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె 2004, 2009, 2014లో ఓడిపోతూ వచ్చారు. అందుకే చంద్రబాబు 2019, 2024 ఎన్నికల్లో ప్రతిభా భారతికి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే తన బదులు కుమార్తె గ్రీష్మకు అవకాశం కల్పించాలని ఆమె చాలాసార్లు కోరారు. ఇప్పుడు ఎమ్మెల్సీ రూపంలో అవకాశం కల్పించారు చంద్రబాబు.
* మహానాడు వేదికపై తొడగొట్టి..
2019లో వైసీపీ( YSR Congress ) అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడేది. ఆ సమయంలోనే టిడిపి మహానాడు తో పార్టీ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన మహానాడు టిడిపి పరిస్థితిని మార్చింది. మహానాడు వేదికగా కావలి గ్రీష్మ ప్రసంగం ఆకట్టుకుంది. ఏకంగా ఆమె తొడగొట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి సవాల్ చేశారు. మండలి లో అటువంటి ఫైర్ బ్రాండ్ మహిళా నేత ఉండాలని చంద్రబాబు భావించారు. అందుకే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : రాటుదేలుతున్న లోకేష్.. ఆ విషయంలో చాలా మెచ్యూర్డ్‌గా..