Seethamma Vakitlo Sirimalle Chettu: రీ రిలీజ్ ట్రెండ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) పాత చిత్రాలు ఎలాంటి రికార్డ్స్ ని నమోదు చేశాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘పోకిరి’ సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వరకు చేరింది. అయితే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'(#SVSCReRelease) చిత్రం క్లాస్ సినిమా కాబట్టి, ఈ చిత్రానికి అనుకున్న రేంజ్ లో వసూళ్లు రావేమో అని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమాకు రీ రిలీజ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా మొదటి రోజు ఎంత గ్రాస్ అయితే వచ్చిందో, రెండవ రోజు కూడా అంతే గ్రాస్ వచ్చింది.
అలా రెండు రోజుల్లో 3 కోట్ల 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మూడవ రోజు 25 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి 3 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. టాప్ 5 లో చోటు అయితే సంపాదించుకోలేదు కానీ, పలు థియేటర్స్ లో మాత్రం అరుదైన రికార్డుని నెలకొల్పింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎంత ఫేమస్ అనేది మన అందరికీ తెలిసిందే. సినిమా చూస్తే ఇక్కడే మొదటి రోజు చూడాలి అని ప్రతీ హీరో అభిమాని కోరుకుంటాడు. ఈ ప్రాంతంలో మహేష్ ఫ్యాన్స్ కి సుదర్శన్ థియేటర్ అడ్డా అని అంటుంటారు. కృష్ణ కాలం నుండి ఈ థియేటర్ లో ఘట్టమనేని కుటుంబానికి ఎన్నో అరుదైన రికార్డ్స్ ఉన్నాయి. ఈ ఒక్క థియేటర్ నుండి మూడు రోజుల్లో దాదాపుగా 43 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇదే ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సుదర్శన్ థియేటర్ ని మెయిన్ థియేటర్ గా కేటాయించారు. ఈ థియేటర్ లో గేమ్ చేంజర్ చిత్రం మూడు రోజుల్లో సాధించని వసూళ్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సాధించిందని, మళ్ళీ ఈ రికార్డుని కొట్టాలంటే కచ్చితంగా మహేష్ సినిమా వల్లే అవ్వుద్దని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత నిర్మాత దిల్ రాజు నుండి మరో సూపర్ హిట్ ఈ రీ రిలీజ్ ద్వారా దక్కింది. ఇక నుండి దిల్ రాజు తన కెరీర్ లో క్లాసిక్ వేల్యూ దక్కించుకున్న సినిమాలను ఒక దాని తర్వాత ఒకటి రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట.