Homeఆంధ్రప్రదేశ్‌Annadata Sukhibhava: రైతుల ఖాతాల్లో రూ.20 వేలు.. అర్హతలు అవే.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

Annadata Sukhibhava: రైతుల ఖాతాల్లో రూ.20 వేలు.. అర్హతలు అవే.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

Annadata Sukhibhava: సంక్షేమ పథకాల( welfare schemes) అమలుపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని భావిస్తోంది. ప్రజలకు చేరువయ్యే ముఖ్య పథకాలపై దృష్టి పెట్టింది. ఆ పథకాలకు సంబంధించి ఈ వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించింది. ముఖ్యంగా ఖరీఫ్ నకు ముందు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా.. ఈ పథకం అమలు ముహూర్తంతో పాటుగా అర్హతల పైన స్పష్టతనిచ్చింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఈ పథకం అమలు చేస్తామని తేల్చి చెప్పింది. కౌలు రైతుల విషయంలో సైతం పథకం వర్తింప చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు అన్నదాత సుఖీభవ పథకం పై కీలక ప్రకటన చేశారు.

* అప్పట్లో రైతు భరోసా పేరిట..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరిట సాగుకు ప్రోత్సాహం అందించేవారు. ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి రూ.13,500 అందించేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం మరో ఆరువేల రూపాయలు మూడు విడతల్లో అందించేది. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆ రూ.6000 తో మరో రూ.14000 కలిపి.. మొత్తం 20 వేల రూపాయలను అర్హత కలిగిన ప్రతి రైతుకు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి శాసనసభలో ప్రకటించారు.

* మూడు విడతల్లో అందించేందుకు..
కాగా రాష్ట్ర ప్రభుత్వ( state government) ఆలోచన చూస్తుంటే మూడు విడతల్లో ఈ మొత్తం అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. మే నెలలోనే ఈ మొత్తాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 55 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్న అందరికీ అందిస్తామని మంత్రి శాసనసభలో ప్రకటించారు. పథకం విధివిధానాలపై కసరత్తు జరుగుతోందని.. వ్యవసాయ అనుబంధ రంగాల వారికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు. పంటల బీమా సౌకర్యంతో పాటుగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. మొత్తానికైతే మేలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు అని తేలిపోయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular