spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AI Anchor Vaibhavi : లోకేష్ కోసం ‘వైభవి’..మైలేజ్ కోసం చంద్రబాబు ఆ పని..

AI Anchor Vaibhavi : లోకేష్ కోసం ‘వైభవి’..మైలేజ్ కోసం చంద్రబాబు ఆ పని..

AI Anchor Vaibhavi : టీడీపీ పూర్వ వైభవం కోసం నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇప్పటికే సగానికిపైగా నడిచేశారు. 2100 కిలోమీటర్ల మైలురాయిని దాటేశారు. అయితే పాదయాత్రలో సగం లక్ష్యం పూర్తయినా లోకేష్ కు అనుకున్నంత మైలేజీ రావడం లేదు. ఎల్లో మీడియా ఎంత చేస్తున్నా హైప్ రావడం లేదు. దీంతో చంద్రబాబు అండ్ కో ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా పవన్ లాంటి వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు మీడియా వాచ్ అంతా అటు వైపు వెళుతోంది. దీంతో లోకేష్ కు ప్రయారిటీ తగ్గుతోంది. అందుకే ఐటీడీపీ విభాగం కొత్త ఆలోచన చేసింది. యువగళం పాదయాత్రకు తామే సొంతంగా ప్రచారం చేసుకోవడానికి డిసైడ్ అయ్యింది.

ప్రస్తుతం లోకేష్ యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. కనిగిరి నియోజకవర్గంలో యువనేత నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచన చేసింది ఐటీడీపీ విభాగం. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు) సాయంతో ఒక యాంకర్ ను క్రియేట్ చేశారు.యాంకరమ్మకు ‘‘వైభవి’’ అన్న పేరును పెట్టారు. దీన్ని ఐ టీడీపీ కనిగిరి విభాగం రూపొందించింది. లోకేశ్ పాదయాత్ర వార్తల్ని.. విశేషాల్ని వైభవి చేత చదివిస్తూ.. లేని హైప్ ను తీసుకురావటం కోసం తెలుగు తమ్ముళ్లు కిందా మీదా పడుతున్నారు. లోకేశ్ పాదయాత్ర విశేషాల్ని వివరిస్తున్న డిజిటల్ యాంకర్ వైభవితోకూడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో పడ్డారు.

తొలుత రాయలసీమతో యాత్ర ప్రారంభమైంది. మీడిల్ ఆంధ్రాలో ప్రవేశించింది. అయితే రాయలసీమలో కొంతవరకూ పాదయాత్ర పర్వాలేదనిపించింది. కోస్తా ప్రాంతం టీడీపీకి పట్టు ఉండడంతో హైప్ క్రియేట్ అవుతుందని చంద్రబాబు అండ్ కో భావించింది. కానీ అనుకున్న స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. సాదాసీదాగానే కొనసాగుతోంది. దీంతో ఏదో ఒక కాన్సెప్ట్ తో పాదయాత్ర ను పైకిలేపాలని కొంతమంది టీడీపీ జీనియస్ ప్రభాకర్స్ ముందుకొచ్చారు. కొత్త ఐడియాలజీని తెరపైకి తెచ్చి అమలు చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version