https://oktelugu.com/

MLA Sudheerreddy: బొజ్జల’.. నీలాంటి వాళ్లను చాలా చూశాం.. అంత ఎగిరిపడకు ఎమ్మెల్యే సారూ

ఇసుక విధానంలో ఎమ్మెల్యేలు కలుగజేసుకోవద్దని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ కొంతమంది యువ ఎమ్మెల్యేలు ఎంటర్ అవుతున్నారు. లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అయితే ఏకంగా మీడియానే బెదిరించారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 24, 2024 / 12:09 PM IST

    mla sudheerreddy

    Follow us on

    Sreekalahasthi mla sudheerreddy : ఈ ఎన్నికల్లో చాలామంది కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు. కూటమి ప్రభంజనంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఇందులో చాలామందికి అనుభవం లేదు. రాజకీయాల్లో ఎలా ఉండాలో తెలియడం లేదు. అందుకే మొన్న సభా సాంప్రదాయాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అయితే ప్రజలు విసిగి వేసారి టిడిపి కూటమికి ఛాన్స్ ఇచ్చారని… వైసిపి ఎమ్మెల్యేలు మాదిరిగా వ్యవహరిస్తే కుదరదని చంద్రబాబు చెప్తున్నారు. వైసీపీ నేతల మాదిరిగా కాకుండా హుందాగా ఉందామని పవన్ సైతం పిలుపునిచ్చారు. అయితే కొందరి ఎమ్మెల్యేల వైఖరి అప్పుడే విమర్శలకు కారణమవుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రి భార్య.. పోలీస్ ఎస్కార్ట్ కోసం పెద్ద గలాటా చేశారు. చివరకు సీఎం చంద్రబాబు సున్నితంగా హెచ్చరించే వరకు పరిస్థితి వచ్చింది. ఓ ఎమ్మెల్యే అయితే ఓ నిర్మాణం కూల్చడం విషయంలో అతిగా ప్రవర్తించారు. అది కూడా విమర్శలకు కారణమైంది. అయితే తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేబొజ్జల సుధీర్ రెడ్డి ఏకంగా మీడియానే హెచ్చరించారు. తాటతీస్తాను అంటూ హెచ్చరికలు పంపారు. తోక కత్తిరిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు.అయితే ఈ వార్నింగ్ఈనాడు విలేఖరికి ఇవ్వడం మరి విశేషం. టిడిపికి అనుకూలమైన పత్రిక ప్రతినిధికి రాయలేని భాషలో హెచ్చరించారు సుధీర్ రెడ్డి. కేవలం ఇసుక రవాణా పై కథనాలు రాసినందుకే ఫోన్ చేసి మరి ఈనాడు విలేఖరికి ఇచ్చి పడేశారు బొజ్జల సుధీర్ రెడ్డి.

    * బొజ్జల కుటుంబానిది సుదీర్ఘ నేపథ్యం
    చిత్తూరు జిల్లాలో బొజ్జల కుటుంబానిది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సుదీర్ఘకాలం టిడిపిలో కొనసాగారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అకాల మరణంతో ఆయన కుమారుడు సుధీర్ రెడ్డిని ప్రోత్సహించారు చంద్రబాబు. ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. మంచి మెజారిటీతో సుధీర్ రెడ్డి గెలిచారు. అయితే యువనేతగా మంచి ఛాన్స్ వచ్చినా.. తన దూకుడు తనంతో ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు సుధీర్ రెడ్డి.

    * ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక
    ప్రభుత్వం ఇసుక పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే.పేదలకు పారదర్శకంగా తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఇదే విషయాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇసుక విధానంలో ఎమ్మెల్యేల ప్రమేయం వద్దని కూడా ఆదేశించారు. లేనిపోని వివాదాలు పెట్టుకోవద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యేలు. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొంతమంది అధికార పార్టీ నేతలు ఇసుక విషయంలో తలదూచుతున్నారు. అదే విషయంపై ఈనాడులో కథనం వచ్చింది. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు బొజ్జల సుధీర్ రెడ్డి. సంబంధిత విలేఖరికి ఫోన్ చేసి హెచ్చరికలు పంపారు. తాటతీస్తానంటూ హెచ్చరించారు.

    * ఈనాడు విలేఖరికి బెదిరింపు
    ఏకంగా ఈనాడు విలేఖరికి ఎమ్మెల్యే బెదిరించడం సంచలనం రేకెత్తించింది. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ప్రత్యేక కథనం రావడం విశేషం.ఇసుక విధానం కోసం ఏకంగా మీడియాని బెదిరించడం ఏంటన్న ప్రశ్న సొంత పార్టీలోనే వినిపిస్తోంది. అది కూడా అనుకూలమైన ఈనాడు మీడియాను బెదిరించడం సంచలనంగా మారింది. దీనిపై సీఎం చంద్రబాబు సైతం స్పందించే అవకాశం ఉంది. మొత్తానికైతే యువ ఎమ్మెల్యే లేనిపోని వివాదాలతో ఆదిలోనే ఇబ్బందులు తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.