https://oktelugu.com/

New liquor policy in AP : మద్యం వ్యాపారులుగా మారుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు

ఏపీలో నూతన మద్యం పాలసీ పుణ్యమా అని సరికొత్తగా కొందరు మందు వ్యాపారులుగా మారుతున్నారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న వారు సైతం.. మద్యం వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆడిటర్లు, వైద్యులు... ఇలా ఒక్కరేమిటి అన్ని వర్గాల వారు మద్యం షాపుల కోసం దరఖాస్తులు చేస్తుండడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : October 7, 2024 9:29 am
    New liquor policy in AP

    New liquor policy in AP

    Follow us on

    New Liquor policy in AP : సాధారణంగా మద్యం వ్యాపారం అంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది. దానికి ప్రత్యేకంగా వ్యాపారులు ఉండేవారు. ఒకవేళ సామాన్యులు మద్యం వ్యాపారం వైపు చూస్తే ముందుగా కుటుంబం నుంచే అభ్యంతరాలు వ్యక్తం అయ్యేవి.కానీ ఇప్పుడు సీన్ మారింది.వారు వీరు అన్న తేడా లేకుండా ధనార్జన ధ్యేయంగా మద్యం వ్యాపారం వైపు అన్ని రంగాలవారు అడుగులు వేస్తుండడం విశేషం. ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైంది దరఖాస్తుల ప్రక్రియ. ఈనెల 9 వరకు ఇది కొనసాగనుంది. 11న షాపులకు లాటరీ తీయనున్నారు. 12న కొత్త షాపులు అందుబాటులోకి రానున్నాయి. అయితే దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి తొలి మూడు రోజులు అంతంతమాత్రంగానే దాఖలు అయ్యాయి. అమావాస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు గడువు ముగుస్తున్న కొలదీ.. దరఖాస్తుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. అధికారుల మైండ్ బ్లాక్ అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష దరఖాస్తులు వరకు వస్తాయని అధికారులు భావించారు. నాన్ రిఫండబుల్ కావడంతో 2000 కోట్ల రూపాయలకు పైగా దరఖాస్తుల రూపంలో ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే భారీగా దరఖాస్తులు నమోదవుతుండడం విశేషం. అయితే ఇప్పుడు అనుభవం లేని వారు సైతం ఈ వ్యాపారంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి.. ఆ స్థానంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు పాత పద్ధతిలోనే అప్పగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. అయితే ఊహించని విధంగా మద్యం దుకాణాల దరఖాస్తులకు విపరీతమైన పోటీ నెలకొంది.

    * అస్సలు అనుభవం లేని వారు సైతం
    అయితే ఈసారి ఏమాత్రం అనుభవం లేని వారు మద్యం వ్యాపారంలో అడుగుపెడుతుండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు ప్రస్తుతం దాఖలవుతున్న దరఖాస్తులను చూస్తే.. ఒక్కో షాపునకు అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు నడిపిన వారు దరఖాస్తు చేసుకుంటారు అనుకుంటే.. సమాజంలో భిన్న వర్గాల వారు సైతం దరఖాస్తులు చేసుకోవడం విశేషం.

    * హైదరాబాద్, చెన్నై వారి అధికం
    అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మద్యం షాపులను దక్కించుకునేందుకు రంగంలోకి దిగడం విశేషం. ఈ జాబితాలో వైద్యులు, కాంట్రాక్టర్లు, ఆడిటర్లు సైతం ఉన్నారు. అయితే ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దరఖాస్తుల అధికంగా ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.అయితే సహజంగా తమ వృత్తిపైనే దృష్టి పెట్టె సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఫోకస్ ఇప్పుడు మద్యం పడడం విశేషం. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు చెన్నై నుంచి వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సిండికేట్ గా మారుతున్నారు. పలు మొత్తం వేసుకొని పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు. మరికొందరు ఇప్పటికే ఈ వ్యాపారంలో అనుభవం సాధించిన వారితో చేతులు కలుపుతున్నారు. ఒకవేళ షాపులు దక్కితే అటు ఉద్యోగంతో పాటు ఇటు వ్యాపారం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్రకు చెందినవారు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవడం విశేషం. అయితే ఎన్నడూ లేని విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంటర్ అయ్యేసరికి.. మద్యం వ్యాపారానికి అలవాటు పడిన వ్యాపారులు కాస్త వెనక్కి తగ్గాల్సి వస్తోంది. మరికొందరైతే గుడ్ విల్ ద్వారా కొంత మొత్తం వెనుకేసుకోవచ్చని దరఖాస్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వస్తే లక్షల్లో ఆదాయం వస్తుంది.. పోతే వేలల్లో పోతుంది అన్నట్టు ఉంది వారి వ్యవహారం.