https://oktelugu.com/

Bigg Boss Telugu 8: యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదించిన మెహబూబ్,’బిగ్ బాస్ 8′ కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇంతేనా..ఇది అన్యాయం!

స్టార్ మా ఛానల్ లో ఒక డ్యాన్స్ షోలో కంటెస్టెంట్ గా చేసాడు. అంతకు మించి పెద్దగా ఆయనకు అవకాశాలు రాలేదు. కానీ యూట్యూబ్ ద్వారా మాత్రం మెహబూబ్ భారీగానే సంపాదించాడు అని చెప్పాలి. అనేక షార్ట్ ఫిలిమ్స్ తో పాటు ఈయన పలు కవర్ సాంగ్స్ కూడా చేసాడు. వాటికి యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ లైక్స్ వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 7, 2024 / 09:12 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: ఇప్పటి వరకు స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్స్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకున్న సీజన్ నాల్గవ సీజన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధానమైన కారణాలలో ఒకరు మెహబూబ్ దిల్ సే. ఈ సీజన్ లో పృథ్వీ మృగం లాగ ఎలా ఆడుతాడో మనమంతా చూసాము. మెహబూబ్ పృథ్వీ కి మూడింతలు ఎక్కువగా ఆడగలడు. ఫిజికల్ టాస్కులలో ఇతను ఎదురుగా ఎవరైనా నిలబడాలంటే భయపడాలి. అలా ఉంటుంది మనోడి ఆట. అలాంటి కంటెస్టెంట్ ని నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపించారు. అయితే నిన్న అడుగుపెట్టిన 8 మంది కంటెస్టెంట్స్ లో కాస్త తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ మాత్రం మెహబూబ్ అని చెప్పొచ్చు.

    ఎందుకంటే ఈయన సీజన్ 4 తర్వాత పెద్దగా అవకాశాలు సంపాదించలేదు. తన తోటి కంటెస్టెంట్స్ మాత్రం వరుసగా సినిమాల్లో, ఎంటర్టైన్మెంట్ షోస్ లో అవకాశాలు సంపాదిస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్నారు. కానీ మెహబూబ్ మాత్రం కేవలం యూట్యూబ్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. అంతకు ముందు ఆయన స్టార్ మా ఛానల్ లో ఒక డ్యాన్స్ షోలో కంటెస్టెంట్ గా చేసాడు. అంతకు మించి పెద్దగా ఆయనకు అవకాశాలు రాలేదు. కానీ యూట్యూబ్ ద్వారా మాత్రం మెహబూబ్ భారీగానే సంపాదించాడు అని చెప్పాలి. అనేక షార్ట్ ఫిలిమ్స్ తో పాటు ఈయన పలు కవర్ సాంగ్స్ కూడా చేసాడు. వాటికి యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ లైక్స్ వచ్చాయి. దాని వల్ల ఆయన నెల ఆదాయం ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. గడిచిన నాలుగేళ్లలో ఆయన కోట్ల రూపాయిలు యూట్యూబ్ ద్వారా సంపాదించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో తక్కువ పారితోషికం తీసుకుంటున్న వైల్డ్ కార్డు కంటెస్టెంట్ మెహబూబ్ అని తెలుస్తుంది.

    ఎందుకంటే ఈయనకి మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే పాపులారిటీ, క్రేజ్ తక్కువ. ఆ కారణం చేతనే మెహబూబ్ కి తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకు వారానికి 3 లక్షల రూపాయిలు ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే టాస్కులో తన సత్తా చాటి పాత కంటెస్టెంట్స్ కి ముచ్చమటలు పట్టించాడు. మెహబూబ్, నయనీ పావని మరియు మణికంఠ, సీతకు కలిపి యాక్షన్ రూమ్ లో ఒక టాస్క్ ని ఏర్పాటు చేస్తాడు బిగ్ బాస్. ఈ టాస్కులో మహబూబ్ చాలా వేగంగా తన పార్ట్ ని పూర్తి చేస్తాడు కానీ, నయనీ పావని కొద్దిగా లో మిస్ అయ్యింది. దీంతో ఈ టాస్కులో ఓడిపోవాల్సి వచ్చింది మెహబూబ్. కానీ ఆయనలో ఎంత ఫైర్ ఉందో చూసిన ప్రేక్షకులు కచ్చితంగా ఇతను బాగా ఆడితే టాప్ 5 లోకి రాగలడు అనే అభిప్రాయాన్ని కలిగించాడు.