Sajjala Bharghav Reddy :  భార్గవరెడ్డిని జగన్ తప్పించారా? సజ్జల తప్పుకునేలా చేశారా?

గత ఐదేళ్ల వైసిపి పాలనలో.. ప్రభుత్వంతో పాటు పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి కర్త, కర్మ, క్రియాలా వ్యవహరించారు. పార్టీలో కీలకమైన వైసీపీ సోషల్ మీడియా పీఠంపై తన కుమారుడు భార్గవరెడ్డిని కూర్చోబెట్టారు. గత ఐదేళ్ల పాటు దర్పాన్ని వెలగబెట్టారు. ఇప్పుడు పార్టీకి పరాజయం ఎదురు కావడంతో కుమారుడిని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : October 7, 2024 9:34 am

Sajjala Bharghav Reddy

Follow us on

Sajjala Bharghav Reddy : సజ్జల భార్గవరెడ్డిని జగన్ తప్పించారా? ఆయన తండ్రి రామకృష్ణారెడ్డి తప్పించారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా గంగిరెడ్డి అనే నేతకు అప్పగించారు జగన్. అయితే ఉన్నపలంగా సజ్జల భార్గవరెడ్డిని తప్పించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని పార్టీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తోంది. గత ఐదేళ్లుగా పార్టీతో పాటు ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషించిన రామకృష్ణారెడ్డి.. అధినేత జగన్ ను తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసిపి హయాంలో ఎమ్మెల్యేల నుంచి వినిపించే సమస్యలు సజ్జల రామకృష్ణారెడ్డి తో ఉండిపోయాయని.. జగన్ వరకు వెళ్లలేదని సీనియర్లు కామెంట్లు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒకరిద్దరు నేతలు బాహటంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఓటమికి ముమ్మాటికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. దీంతో సజ్జల పాత్ర కూడా పార్టీలో తగ్గింది. పార్టీ కార్యక్రమాలకు హాజరైనా మునుపటిలా యాక్టివ్ గా కనిపించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రను తగ్గించారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆచూకీ కనిపించకుండా పోయింది. అయితే తాజాగా భార్గవ్ రెడ్డి స్థానంలో గంగిరెడ్డి అనే వ్యక్తికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే సజ్జల దగ్గరుండి భార్గవరెడ్డిని తప్పించారా? లేకుంటే జగన్ దూరం పెట్టారా? పార్టీ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది.

* గత ఐదేళ్లుగా బాధ్యతలు
గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను చూశారు భార్గవ్ రెడ్డి. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు తన మార్క్ ను చూపించారు. ఈ క్రమంలో సొంత అజెండాను అమలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.అయితే నాడు విపక్షాలపై టార్గెట్ చేయడంలో వైసీపీ సోషల్ మీడియా ముందుండేది. ఈ క్రమంలో చాలా రకాల తప్పిదాలు అప్పట్లో చోటు చేసుకున్నాయి. వైసిపి సోషల్ మీడియా శృతిమించి వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కేసులు తప్పవని భార్గవరెడ్డి భయపడ్డారు. అందుకే ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ గంగిరెడ్డి అనే వ్యక్తికి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే వ్యూహాత్మకంగా భార్గవ్ రెడ్డిని ఆయన తండ్రి రామకృష్ణారెడ్డి తప్పించారని కూడా ప్రచారం జరుగుతోంది.

* ఓ మహిళ మృతి మిస్టరీగా
అయితే వైసిపి సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న గీతాంజలి అనే మహిళ ఇటీవల మృతి చెందింది. ఆ కేసు భార్గవ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. అందుకే ఆయన తండ్రి రామకృష్ణారెడ్డి అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉన్న నేపథ్యంలో.. ఏ రోజైనా భార్గవ్ రెడ్డి అరెస్ట్ తప్పదని రామకృష్ణారెడ్డి భావించినట్లు సమాచారం. అందుకే ఉద్దేశపూర్వకంగా తన కుమారుడిని ఎస్కేప్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఓ తండ్రిగా ఆలోచించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్నాళ్లకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో తన కొడుకు స్థానంలో మరొకరిని తెచ్చి.. బలి పశువును చేశారన్న కామెంట్స్ వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.