https://oktelugu.com/

CM Chandrababu: అమరావతి తెరపై సింగపూర్.. కేంద్రానికి చంద్రబాబు విన్నపం

అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్లాన్ అమలు చేయాలని చంద్రబాబు అప్పట్లో ప్రయత్నించారు.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ ప్రభుత్వం వైదొలిగింది.ఇప్పుడు మరోసారి కలుపు కెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 16, 2024 / 11:48 AM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu: అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది.అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.అటు కేంద్రం నుంచి కూడా ఆశించిన స్థాయిలో సాయం అందుతుంది.అందుకే రెట్టింపు ఉత్సాహంతో అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది కూటమి ప్రభుత్వం.వచ్చే నెల నుంచి నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది.ఇప్పటికే కేంద్రం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రపంచ బ్యాంకు నిధుల రూపంలో సర్దుబాటు చేసింది.ఆ నిధుల విడుదలకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు కేంద్రం సైతం కీలక ప్రాజెక్టులను అమరావతికి మంజూరు చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో అమరావతిలో గతంలో మాస్టర్ ప్లాన్ విషయంలో సహకరించిన సింగపూర్ నుమరోసారి భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.ఈ మేరకుకేంద్రానికి ప్రత్యేక అభ్యర్థన చేశారు చంద్రబాబు. దీంతో కేంద్రం నిర్ణయం కీలకంగా మారింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో రెండు ప్రభుత్వాల భాగస్వామ్యంతోమాస్టర్ ప్లాన్ రూపొందించారు. సింగపూర్ సహాయం కూడా అప్పట్లో తీసుకుంది చంద్రబాబు సర్కార్. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత సింగపూర్ ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. అప్పట్లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.అయితే గత ఐదేళ్లుగా సింగపూర్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం రావడం, అమరావతి పై ఫోకస్ పెట్టడంతో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

    రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్రం అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ అంశం పైనే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో చర్చించారు చంద్రబాబు. అమరావతి కోసం సింగపూర్ తో భాగస్వామ్యం పునరుద్ధరించాలని కోరారు. ఏపీలో పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఆహ్వానించాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. అయితే చంద్రబాబు విన్నపాలపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అటు తరువాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కలిశారు.ఆర్థికపరమైన వినతులు అందించారు.

    * ప్రారంభోత్సవాలకు ఆహ్వానం
    అమరావతికి ప్రత్యేక రైల్వే ప్రాజెక్టులను కేటాయించింది కేంద్రం. వాటికి సంబంధించి ప్రారంభోత్సవాలు కూడా చేయనుంది. మరోవైపు విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు కూడా కేంద్రం పచ్చ జెండా ఉంటుంది. దాని ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా ఏర్పాట్లపై చంద్రబాబు రైల్వే శాఖ మంత్రితో చర్చలు జరిపారు. మంచి రోజు చూసుకుని ప్రారంభించాలని భావిస్తున్నారు. మొత్తానికైతే అమరావతి రాజధాని నిర్మాణం పనుల్లో సింగపూర్ను భాగస్వామ్యం చేయాలన్న చంద్రబాబు ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.మరి ఏం జరుగుతుందో చూడాలి.