https://oktelugu.com/

Peddapalli: కిడ్నీ దానం.. అయినా దక్కని ప్రాణం.. ఆ తల్లి త్యాగం వృథా..

ఉరుకులు పరుగుల జీవితం.. మారుతున్న జీవన శైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. కలుషిత ఆహారం, నీరు కారణంగా కిడ్నీ వ్యాధులు పెరుగతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : November 16, 2024 11:44 am
Peddapalli

Peddapalli

Follow us on

Peddapalli: కలుషిత ఆహారం.. కలుషితమైన నీరు.. ఫోరైడ్‌ నీరు.. ఉరుకుల పరుగుల జీవితం.. ఆహారం విషయంలో నిర్లక్ష్యం మన జీవితాలను రోగాల మయం చేస్తోంది. శరీరాలను చెత్త కూపంలా మారుస్తున్నాయి. దీంతో దీర్ఘకాలిక రోగాలూ పెరుగుతున్నాయి. ఇలాంటి వ్యాధుల్లో కిడ్నీ సమస్య కూడా ఒకటి. ఇటీవలి కాలంలో కిడ్నీల్లో రాళ్లు.. కిడ్నీ ఫెయిల్యూర్‌ సమస్యలు పెరుగుతున్నాయి. మన శరీరంలోని వ్యర్థాలను విసర్జించే వ్యవస్థల్లో కిడ్నీలు ప్రధానమైనవి. అయితే ఏటా మన దేశంలో 1.9 లక్షల మంది మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారు. అయితే పెరుగుతున్న వైద్య పరిజ్ఞానంలో అవయవాల మార్పిడి కీలకంగా మారింది. ప్రధానమైన గుండె నుంచి అన్ని అవయవాలనుఏ వైద్యులు మారుస్తున్నారు. దీంతో కిడ్నీ మార్పిడి చేయించుకునేవారు పెరుగుతున్నారు. చికిత్స ఖరీదైనదే అయినా జీవితం కన్నా విలువైంది ఏదీ లేదని కిడ్నీ మార్పిడికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కిడ్నీ దాతలు దొరకడం కూడా కష్టంగా మారింది.

కొడుకుకు కిడ్నీ ఇచ్చిన తల్లి..
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్‌ గ్రామానికి చెందిన పొన్నం రాము(35) కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా కిడ్నీ పనితీరు మెరుగు పడలేదు. దీంతో వైద్యులు కిడ్నీ మార్పిడే పరిష్కరమని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు దాతల కోసం గాలించారు. దాతలు దొరకకపోవడంతో ఎలాగైనా తన కొడుకును కాపాడుకోవాలని, అతని తల్లి కిడ్నీ దానానికి ముందుకు వచ్చింది. కిడ్నీ దానం చేసింది. దీంతో తన కొడుకు ఆరోగ్యం ఇక మెరుగు పడుతుందని భావించింది.

అయినా దక్కని ప్రాణం..
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. తల్లి కోలుకుంది. కానీ, కొడుకు పరిస్థితి మెరుగు పడలేదు. క్రమంగా ఆరోగ్యం క్షీణించింది. చివరకు చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.