Bhimavaram: పవన్ ఆదేశాలతో యువతికి విముక్తి

భీమవరానికి చెందిన తేజస్విని అనే యువతి విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతోంది. గత తొమ్మిది నెలలుగా ఆమె కనిపించడం లేదు. దీంతో బాధితురాలు తల్లి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Written By: Dharma, Updated On : July 4, 2024 12:34 pm

Bhimavaram

Follow us on

Bhimavaram: పవన్ ఆదేశాలతో కిడ్నాప్ నకు గురైన యువతి తల్లిదండ్రుల వద్దకు చేరింది. 9 నెలల కిందట అదృశ్యమైన ఆ యువతి ఆచూకీ లేకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశ్రయించింది బాధితురాలి తల్లి. పవన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు తొమ్మిది రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించగలిగారు. బాధిత యువతిని తల్లిదండ్రులకు అప్పగించగలిగారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని.. వాటన్నింటిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

భీమవరానికి చెందిన తేజస్విని అనే యువతి విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతోంది. గత తొమ్మిది నెలలుగా ఆమె కనిపించడం లేదు. దీంతో బాధితురాలు తల్లి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న పవన్ ప్రజా దర్బారు నిర్వహించారు. గత నెల 22న బాధితురాలు తల్లి పవన్ ను ఆశ్రయించింది. పవన్ ఆదేశాల మేరకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ మేరకు తేజస్విని అదృశ్యం వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేలింది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో సహచరుడు అయిన అంజాద్ ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. పెళ్లి పేరిట హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడ నుంచి వివిధ ప్రాంతాలను తిప్పుతూ.. జమ్మూ చేరుకున్నారు. ఇన్స్ట్రాగ్రామ్ లో సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. తేజాశ్విని జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో గుర్తించారు. బుధవారం ప్రత్యేక విమానంలో విజయవాడ తీసుకొచ్చారు.

గత ఏడాది అక్టోబర్ 28న తేజస్విని కనిపించకుండా పోయింది. గత తొమ్మిది నెలలుగా తన వద్ద ఉంచుకున్న అంజాద్ తేజస్విని ఎవరితో మాట్లాడకుండా కట్టడి చేశాడు. ఆమెను ఒక గదిలో బందీగా ఉంచాడు. భాష తెలియకపోవడంతో ఆమె ఎవరిని సంప్రదించలేకపోయింది. దీంతో తల్లిదండ్రులకు కానీ, పోలీసులకు కానీ ఆచూకీ తెలియలేదు. అయితే అంజాద్ ఆమెను తరచూ ప్రాంతాలను మార్చుతూ చివరకు జమ్ము చేరుకున్నాడు. ముందుగా నవంబర్లో హైదరాబాద్, కేరళ, ముంబై, రాజస్థాన్ వెళ్లారు. డిసెంబర్లో ఢిల్లీలో జమ్మూ తావి రైలుకి జమ్మూ స్టేషన్ లో దిగారు. జమ్మూలో ఓ హోటల్లో పనికి కుదిరాడు. అయితే తేజస్విని మాట్లాడేందుకు ఫోన్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. చివరికి అంజాద్ లేని సమయంలో ఫోన్ ద్వారా సోదరికి ఇన్స్టాలో సందేశం పంపించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జమ్మూ పోలీసుల సహకారంతో వారినివిజయవాడ తీసుకొచ్చారు. బాధితురాలు స్టేట్మెంట్ ఇవ్వడంతో అంజాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు తన కుమార్తె దక్కుతుందని అనుకోలేదని.. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతోనే తన కుమార్తె ఆచూకీ తెలిసిందని.. త్వరలో పవన్ ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతానని బాధితురాలు తల్లి చెబుతోంది.