Tollywood: తెలుగులో మొదటి 6 నెలల్లో మూడే హిట్లు.. మరి వచ్చే 6 నెలల్లో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు..?

Tollywood: మొత్తానికైతే గడిచిన ఆరు నెలల్లో మూడు సక్సెస్ లే వచ్చాయి. మరి ఇప్పుడు రాబోతున్న ఆరు నెలల్లో ఎలాంటి సక్సెస్ లను అందుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

Written By: Gopi, Updated On : July 4, 2024 12:29 pm

tollywood upcoming movies 2024

Follow us on

Tollywood: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న పెద్ద సినిమాల హవా అనేది కొంతవరకు తగ్గింది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలు మాత్రమే సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఆరు నెలల సమయంలో మూడు సక్సెస్ లు మాత్రమే సాధించడం అనేది చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.

అందులో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్ ‘ సినిమా 50 కోట్ల బడ్జెట్ తో వచ్చి 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…ఇక సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమా కూడా దాదాపు 150 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ రెండింటి తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకోవడంతో ఈ సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి.

ఇక మొత్తానికైతే గడిచిన ఆరు నెలల్లో మూడు సక్సెస్ లే వచ్చాయి. మరి ఇప్పుడు రాబోతున్న ఆరు నెలల్లో ఎలాంటి సక్సెస్ లను అందుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో చాలామంది స్టార్ హీరోలు థియేటర్లకి వస్తున్నారు. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ హవా అనేది పాన్ ఇండియా లెవెల్ లో కొనసాగబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక పుష్ప 2 తో అల్లు అర్జున్, దేవర సినిమాతో ఎన్టీఆర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాతో రామ్, గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్, మిస్టర్ బచ్చన్ తో రవితేజ లాంటి స్టార్లు రాబోతున్నారు… కాబట్టి ఈ ఆరు నెలల వ్యవధి లో రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం గా తెలుస్తుంది… చూడాలి మరి మొదటి ఆరు నెలలు లైట్ తీసుకున్న మన హీరోలు రాబోయే ఆరు నెలల్లో ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తారు అనేది…