Homeఆంధ్రప్రదేశ్‌Jagan Manifesto: జగన్ మేనిఫెస్టోలో సంచలన నిర్ణయాలు

Jagan Manifesto: జగన్ మేనిఫెస్టోలో సంచలన నిర్ణయాలు

Jagan Manifesto: ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ వెల్లడైంది. టిడిపి, జనసేన,బిజెపి ఒకటయ్యాయి. తొలి ప్రచార సభలో వైసిపి ఓటమి తమ ధ్యేయమని మూడు పార్టీల నేతలు ప్రకటించారు. దీంతో జగన్ అలర్ట్ అయ్యారు. తిరిగి అధికారం నిలబెట్టుకోవడంపై కసరత్తు వేగవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇదే దూకుడుతో మ్యానిఫెస్టో ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఈనెల 20న మేనిఫెస్టో ప్రకటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన కీలక అంశాలపై చర్చించేందుకేనని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో జగన్ నవరత్నాలను ప్రకటించారు. అందులో చాలా వరకు అమలు చేశారు. మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు వంటి వాటిని అమలు చేయలేకపోయారు. కానీ కొన్నింటి విషయంలో హామీ ఇవ్వకపోయినా.. అమలు చేసి చూపించారు. దీంతో జగన్ చెబితే చేస్తారు అన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. దీంతో ఈసారి మేనిఫెస్టోలో జగన్ ఎలాంటి హామీలు ఇస్తారనేది రాజకీయంగాను ఆసక్తి పెంచుతోంది. రైతులకు రుణమాఫీ చేస్తారా? రైతులకు సాగు ప్రోత్సాహం కింద ఇస్తున్న మొత్తాన్ని 20వేల రూపాయలకు పెంచుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

2019 ఎన్నికల్లో మహిళలనే జగన్ టార్గెట్ చేసుకున్నారు. వారికి రుణమాఫీ హామీ ఇచ్చారు. ఇప్పుడు తిరిగి ఆర్థికంగా చేయూత అందించేందుకు ఏటా ఆర్థికంగా మేలు జరిగేలా కీలక నిర్ణయం ఉంటుందని ఒక అంచనా. అదే సమయంలో సామాజిక పింఛన్లు 3000 నుంచి నాలుగు వేలకు పెంచే హామీ సైతం ఉంటుందని తెలుస్తోంది. అటు యువతకు సంబంధించి ఆసక్తికరమైన హామీ ఒకటి ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల 20న మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు రీజినల్ కోఆర్డినేటర్లతో జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. రోజుకు రెండు నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే జగన్ మేనిఫెస్టో సంచలన ప్రకటనలకు తెరతీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version