Super Hit Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలు సాధించిన విజయాలు చాలా ఉన్నప్పటికీ, వాళ్ల తర్వాత జనరేషన్ లో వచ్చిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మహేష్ బాబు(Mahesh Babu), ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు సాధిస్తున్న విజయాలు ప్రస్తుతం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటున్నాయి.
ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఏదైనా సినిమా సూపర్ హిట్ అయిందంటే దానికి ముందుగా చాలా కాంట్రవర్సీలు జరుగుతూ ఉంటాయి. అలాంటి కాంట్రవర్సీలో నుంచి పబ్లిసిటీ కూడా బీభత్సంగా జరిగి సూపర్ సక్సెస్ లను అందుకున్న సినిమాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చూద్దాం…
మగధీర
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్ గా రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ సినిమాను రైటర్ విజయేంద్ర ప్రసాద్ ‘చండెరీ ‘ అనే బుక్ నుంచి ఈ స్టోరీని కాపీ చేశారు అంటూ ఒక రైటర్ ఈ సినిమా మీద కేసు వేశాడు. దాంతో ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ జరిగింది. అలాగే సినిమా సూపర్ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. ఒక విధంగా అలాంటి కాంట్రవర్సీ చేయడం అనేది సినిమాకి పబ్లిసిటీ పరంగా చాలా హైప్ ను ఇచ్చిందనే చెప్పాలి…
శ్రీమంతుడు
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా కూడా సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ సినిమా విషయంలో నవల రచయిత అయిన శరత్ ఈ సినిమా స్టోరీ తనదని తన నవల నుంచి ఈ సినిమాను కాపీ చేసారంటూ కోర్టులో కేసేశాడు. దానికి సంబంధించిన కేసు నడుస్తుండగా ఈ సినిమా కాంట్రవర్సీలో ఇరుక్కుంది. అలా భారీ స్థాయి లో పబ్లిసిటీ జరగడంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది…
ఇలా ప్రతి సినిమాకి కాంట్రవర్సీ జరగడం అనేది అప్పట్లో సర్వసాధారణం అయింది. కొంతమంది సినీ విమర్శకులు దర్శక నిర్మాతలు కావాలనే ఇలా కాంట్రవర్సీలు చేయిస్తూ సినిమా మీద క్రేజ్ ను తెచ్చి పెడుతున్నారు. అందువల్ల సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అవుతున్నాయి అంటూ వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేశారు…