WPL 2024: ఆరుకోట్లతోపాటు.. ఆ ఐదు అవార్డులు కూడా బెంగళూరుకే

6 కోట్ల ప్రైజ్ మనీ తో పాటు బెంగళూరు జట్టుకు అనేక అవార్డులు వచ్చాయి. ఆ జట్టులోని ఐదుగురు అమ్మాయిలు కీలక పురస్కారాలు దక్కించుకున్నారు. ఆరెంజ్ క్యాప్ ను ఎలీస్ ఫెర్రీ దక్కించుకుంది. ఈ టోర్నీలో ఫెర్రీ 347 పరుగులు చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 18, 2024 11:22 am

WPL 2024

Follow us on

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్లో బెంగళూరు జట్టు సరికొత్త చాంపియన్ గా ఆవిర్భవించింది. గత ఏడాది ఈ లీగ్ ప్రారంభం కాగా.. మొదటి సీజన్లో ఢిల్లీ జట్టు ఆశించినంత స్థాయిలో ఆట తీరును ప్రదర్శించలేకపోయింది. దీంతో స్మృతి సేనపై విమర్శలు వినిపించాయి. ఇదేం ఆట తీరంటూ చీత్కారాలు ఎదురయ్యాయి. కానీ వాటన్నింటికి ఫైనల్ గెలుపు ద్వారా చెప్పింది. గత ఏడాది ఢిల్లీ జట్టు రన్నరప్ గా నిలిస్తే.. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు బౌలింగ్ ముందు డీలా పడింది. 113 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ విజయం ద్వారా బెంగళూరు జట్టుకు ఆరుకోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఢిల్లీకి మూడు కోట్లు దక్కాయి.

6 కోట్ల ప్రైజ్ మనీ తో పాటు బెంగళూరు జట్టుకు అనేక అవార్డులు వచ్చాయి. ఆ జట్టులోని ఐదుగురు అమ్మాయిలు కీలక పురస్కారాలు దక్కించుకున్నారు. ఆరెంజ్ క్యాప్ ను ఎలీస్ ఫెర్రీ దక్కించుకుంది. ఈ టోర్నీలో ఫెర్రీ 347 పరుగులు చేసింది. ఐదు లక్షల బహుమతి అందుకుంది. పర్పుల్ క్యాప్ శ్రేయాంక అందుకుంది. 13 వికెట్లు తీయడం ద్వారా ఆమెకు ఈ పురస్కారం లభించింది. దీంతోపాటు ఐదు లక్షల నగదు కూడా తన సొంతమైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సోఫీ మొలి నెక్స్ నిలిచింది. ఈ పురస్కారం కింద ఆమెకు 2.5 లక్షలు దక్కాయి. పెయిర్ ప్లే అవార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దక్కింది. ఈ అవార్డుతో పాటు ఐదు లక్షల నగదు పురస్కారం కూడా ఆ జట్టుకు లభించింది. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా బెంగళూరు జట్టుకు చెందిన జార్జియా వరేహం నిలిచింది. దీంతోపాటు ఆమెకు 5 లక్షల నగదు పురస్కారం కూడా ఇచ్చారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా దీప్తి శర్మ ఎంపికయింది. ఈ అవార్డుతోపాటు ఐదు లక్షల నగదు పురస్కారం కూడా ఆమె అందుకుంది. మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ గా షెఫాలీ వర్మ నిలిచింది. ఈ పురస్కారంతోపాటు నిర్వాహక కమిటీ ఆమెకు ఐదు లక్షల నగదు కూడా అందించింది. క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ గా సంజీవన్ సజానా ఎంపికైంది. ఆమెకు పురస్కారంతోపాటు ఐదు లక్షల నగదు అందించారు.

ఇక ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు పై బెంగళూరు అద్భుతమైన ప్రదర్శన చేసింది. క్యూరేటర్ చెప్పినట్టుగానే ఈ మైదానంపై బెంగళూరు స్పిన్నర్లు అదరగొట్టారు. మొలి నెక్స్ 3, శ్రేయాంక 4, శోభన 2 వికెట్లు తీసి ఢిల్లీ జట్టును కకావికలం చేశారు. 18.3 ఓవర్లలోనే ఢిల్లీ జట్టు 113 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మందాన 31, సోఫీ డివైన్ 32, ఫెర్రీ 35, రిచా 17.. సత్తా చాటడంతో బెంగళూరు గెలిచింది. చివరి ఓవర్ లో అరుంధతి రెడ్డి బౌలింగ్లో రిచా బౌండరీ సాధించడంతో బెంగళూరు డగ్ అవుట్ లో సంబరాలు మిన్నంటాయి.