Sajjala Bhargava Reddy : సజ్జల కుటుంబానికి( sajjala family ) వరుసగా షాక్ లు తప్పడం లేదు. కడప జిల్లాలో సజ్జల ఎస్టేట్ నుంచి భారీగా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో సజ్జల కుటుంబం భారీగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో దర్యాప్తు చేసిన కూటమి ప్రభుత్వం దాదాపు 60 ఎకరాలకు పైగా ఆక్రమణలు ఉన్నట్టు తేల్చి ఆ భూములను నిన్ననే వెనక్కి తీసుకుంది. అయితే బాగా సజ్జల కుమారుడు భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశ తప్పలేదు. ఓ కేసులో బెయిల్ నిరాకరించడంతో పాటు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. అంత తేలిగ్గా తప్పించుకోలేరని హెచ్చరించింది. దీంతో సజ్జల భార్గవ రెడ్డికి ఉచ్చు ఖాయమని స్పష్టమైంది.
Also Read : జగన్ అరెస్ట్.. చంద్రబాబుకు కేంద్ర పెద్దల సూచన అదే!
* ఐదేళ్లు సాగిన హవా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో వైసిపి సోషల్ మీడియా విభాగాన్ని హ్యాండిల్ చేసేవారు సజ్జల భార్గవ్ రెడ్డి. పార్టీతో పాటు ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలోనే పార్టీలో అత్యున్నతంగా భావించే సోషల్ మీడియా విభాగ బాధ్యతలను భార్గవ్ రెడ్డికి అప్పగించారు. అయితే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై విష ప్రచారం చేయడానికి ఈ సోషల్ మీడియాను ఉపయోగించింది. చివరకు న్యాయవ్యవస్థ పై సైతం కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దాని పైనే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా సజ్జల భార్గవ్ రెడ్డి పై వరుసగా కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది.
* ముందస్తు బెయిల్ కు పిటిషన్..
వాస్తవానికి ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డిని( sajjala Bhargava Reddy ) అరెస్టు చేయాల్సి ఉంది. అయితే కిందిస్థాయి కోర్టులు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అరెస్టు నుంచి రెండు వారాలపాటు మద్యంతర ఉపశమనం కల్పించింది. ఎంతలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. దీంతో కేసు మొదటికి వచ్చినట్లు అయింది. గతంలో కిందిస్థాయి కోర్టుల్లో సజ్జల భార్గవ్ రెడ్డికి బెయిల్ రాలేదు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందాలని భావించారు. కానీ ఇక్కడ కూడా సానుకూల తీర్పు రాలేదు.
* న్యాయమూర్తుల హాట్ కామెంట్స్.. సుప్రీంకోర్టులో( Supreme Court) ఈరోజు జస్టిస్ పంకజ్ మెత్తల్, ఎస్విఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.’ సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా? ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తెలుసుకోలేమా? ఆ పోస్టులు భరించరాని స్థాయికి వెళ్ళాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదు. తప్పక శిక్షిస్తుంది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందనుకోవద్దు. అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు ‘ అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ పరిణామం సజ్జల భార్గవరెడ్డికి షాక్ ఇచ్చింది. మున్ముందు ఈ కేసుల్లో కీలక తీర్పులు వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో.. జగన్ సోషల్ మీడియా శిబిరం ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది.