Jagan Action Pawan Reaction
Jagan Action Pawan Reaction: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టం.. అంతకంతకు అనుభవించేలా చేస్తాం.. ఎవ్వరిని వదలం.. ఎక్కడున్నావ్ వదలం అంటూ.. జగన్మోహన్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనిపై నేషనల్ మీడియా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించింది. అయితే ఆయన ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. జగన్ వర్సెస్ పవన్ అన్నట్టు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అంతటా ఇదే చర్చ నడుస్తోంది.
Also Read: Daughter-in-law Cathy Chui: కోడలికి రూ.2,209 కోట్ల కానుక.. ఇంత మంచి మామ ఎవరో తెలుసా?
* పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు..
ప్రాంతాలవారీగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు పంపారు. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధించే వాళ్ల పేర్లను మీరు ఏ బుక్ లో నైనా రాసుకోండి.. ఎక్కడున్నా వాళ్ళని లాక్కొని వస్తా.. విదేశాలకు పారిపోయినా లాక్కొని వస్తా.. రిటైర్డ్ అయినా లాక్కొని వస్తా.. ఎవరిని వదిలి పెట్టేది ఉండదు.. ఒక్కొక్కరికి సినిమా ఎట్టా చూపించాలో అట్టా చూపిస్తా అంటూ జగన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. సినిమా డైలాగులతో అదరగొట్టారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
Also Read: Chandrababu to Meet Union Ministers : వరుసగా ఏడుగురు కేంద్ర మంత్రులతో.. చంద్రబాబు ఎందుకలా!
* నవ్వుతూనే రియాక్షన్..
అయితే నేషనల్ మీడియా( National media) ప్రతినిధులు కొందరు జగన్ కామెంట్స్ ను.. పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ తిరిగి అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టను అనే వార్నింగ్ ఇచ్చినట్లు.. దానిపై మీ రియాక్షన్ ఏంటని అడిగారు. అయితే ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ నుంచి భారీ డైలాగు వస్తుందని భావించారు నేషనల్ మీడియా ప్రతినిధులు. పవన్ రియాక్షన్ వయలెంట్ గా ఉంటుందని కూడా అంచనా వేశారు. కానీ పవన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. హహహహహ.. అంటూ నవ్వారు. జగన్మోహన్ రెడ్డిని పిచ్చ లైట్ తీసుకుంటున్నట్లు అని భావిస్తున్నట్టు నవ్వారు. అవునా.. అది చూద్దాంలే అన్నట్టు సంకేతాలు పంపారు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గెలుస్తామనే నమ్మకం ఉందా? ప్రజలు గెలిపిస్తారని ఆశ ఉందా? అనే తీరులో ఉంది పవన్ నవ్వు. జగన్ వార్నింగ్ వర్సెస్ పవన్ రియాక్షన్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా మాట్లాడగా.. పవన్ పాత వీడియోను జత చేసి.. ఇలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అర్థమైంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Jagan action pawan reaction viral video