Khaleja re-release : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ చిత్రాల లిస్ట్ తీస్తే అందులో ఖలేజా(Khaleja Movie) చిత్రం కచ్చితంగా ఉంటుంది. అతడు లాంటి చిత్రం తర్వాత త్రివిక్రమ్(Trivikram Srinivas), మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రమిది. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోవడం లో విఫలమై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది కానీ, కాలం గడిచే కొద్దీ జనరేషన్స్ మారే కొద్దీ ఈ సినిమాని నచ్చడం మొదలు పెట్టారు ఆడియన్స్. టీవీ లో ఈ చిత్రం ఎప్పుడు టెలికాస్ట్ అయినా బ్లాక్ బస్టర్ రేటింగ్స్ వస్తుంటాయి. ఓటీటీ లో కూడా ఈ సినిమాకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే యూత్ ఆడియన్స్ లో ఈ చిత్రానికి అంతటి క్రేజ్ ఏర్పడింది. ఎప్పటి నుండో ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
Also Read : ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇచ్చేవాడే ఇలా ఉంటే..ఇక అల్లు అర్జున్ అట్లీ మూవీలో ఎలా ఉండబోతున్నాడో!
వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్స్ మొదలెట్టిన వెంటనే ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 11 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం సంచలనం గా మారింది. మన ఇండియన్ సినిమా రీ రిలీజ్ హిస్టరీ లోనే కాదు, ప్రపంచం లో ఏ రీ రిలీజ్ చిత్రానికి కూడా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. ఒక కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయో, అలాంటి బుకింగ్స్ ఈ చిత్రానికి జరుగుతుంది. బుక్ మై షో యాప్ లో ఆ టికెట్స్ అమ్మకాల ట్రెండ్ ని చూసి కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ట్రేడ్ విశ్లేషకులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. కేవలం గంటలోనే హైదరాబాద్ సిటీ లో ఈ చిత్రానికి 16 లక్షల రూపాయిల అడ్వాన్స్ గ్రాస్ వచ్చిందట.
అంతే కాకుండా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా అప్పుడే 70 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందని అంటున్నారు. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి ఆల్ టైం రికార్డు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న రాత్రి నుండి అక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. ఈ సినిమాకు ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే మొదటి రిలీజ్ గ్రాస్ వసూళ్లను దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అప్పట్లో ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడం వల్ల కేవలం 28 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఈ రీ రిలీజ్ మేనియా చూస్తుంటే కేవలం వీకెండ్ కి ఆ కలెక్షన్స్ ని దాటేసాలాగా ఉంది ఈ సినిమా. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ ని నెలకొల్పుతుంది అనేది.