CM Chandrababu: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) అరెస్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? దానిపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారా? కేంద్ర పెద్దలు ఓకే అనేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు నిన్ననే ఢిల్లీ వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులతో పాటు కూటమి ఎంపీలు చంద్రబాబుకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా చంద్రబాబు అమిత్ షా నివాసానికి వెళ్లారు. అక్కడే డిన్నర్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు రెండు గంటలపాటు అక్కడ సుదీర్ఘ చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. అది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసమేనని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గురించి సమగ్రంగా చంద్రబాబు వివరించినట్లు సమాచారం.
Also Read : జగన్ యాక్షన్.. పవన్ రియాక్షన్.. వీడియో వైరల్!
* సరిగ్గా ఆ సమయంలోనే..
చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు( Delhi tour ) వెళ్లిన సమయంలోనే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడని జగన్ ఏకంగా నాలుగు గంటలపాటు ప్రెస్ మీట్ ఇచ్చారు. అన్నింటికంటే మించి మద్యం కుంభకోణం పైనే ఎక్కువగా మాట్లాడారు. అసలు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మద్యం కుంభకోణం అనేది జరగలేదని.. సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పైగా తమ ప్రభుత్వ హయాంలో కుంభకోణానికి, అవినీతికి అవకాశం లేదని తేల్చేశారు. తమ హయాంలో ప్రభుత్వానికి ఆదాయం పెంచామని.. ఎటువంటి అవినీతి జరగలేదని.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిస్తే అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తుంటే అరెస్టు చేస్తారన్న భయం మాత్రం కనిపించింది. తాను విజయవాడలోనే ఉంటానని.. దమ్ముంటే అరెస్ట్ చేసుకోవచ్చని కూడా ఆయన సవాల్ చేశారు.
* పక్కా ఆధారాలతోనే..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని పక్కాగా ఆధారాలు దొరికాయి. తొలుత మద్యం కుంభకోణం విషయంలో టిడిపి పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడి నుంచి కదలిక ప్రారంభం అయ్యింది. అటు తరువాత లావు శ్రీకృష్ణదేవరాయలు హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. లభ్యమైన ఆధారాలు చూపించారు. అటు తరువాత ఏపీలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటయింది. వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. తదుపరి అరెస్టు జగన్ దే అని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రావడం.. చంద్రబాబు ఢిల్లీ టూర్ కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* జాగ్రత్తగా అడుగులు వేస్తున్న చంద్రబాబు..
జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో చంద్రబాబు ( CM Chandrababu) చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా కేంద్ర పెద్దల అనుమతి తీసుకుని రంగంలోకి దిగుతారు. ఇప్పుడు కూడా చంద్రబాబు కేంద్ర పెద్దలను కలిసి జగన్ అరెస్ట్ విషయంలో వారి అనుమతులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యంగా అప్పటి ఆధారాలను పూర్తిగా సేకరించి.. ప్రజల మధ్య పెట్టి బలమైన చర్చ జరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అటు తరువాతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు ఉపక్రమిస్తారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.